పర్వతారోహకుడు నిర్మల్‌ పుర్జా చివరి ఫొటో..

Published on Mon, 08/03/2026 - 12:25

న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని కారకోరం శ్రేణిలో ఉన్న బ్రాడ్ పీక్‌పై సంభవించిన భారీ హిమపాతానికి  కొద్ది క్షణాల ముందు ప్రముఖ బ్రిటీష్-నేపాల్ పర్వతారోహకుడు నిర్మల్ ‘నిమ్స్’ పుర్జా, ఆయన బృందానికి సంబంధించిన చివరి ఫోటో ఆన్‌లైన్‌లో వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌కు చెందిన ‘కరకోరం విజన్’ అనే టూర్ ఆపరేటర్ సంస్థ ఈ చిత్రాన్ని షేర్ చేస్తూ, 8,051 మీటర్ల ఎత్తైన బ్రాడ్ పీక్‌పై జూలై 30న ఈ ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందు ఇది కెమెరాలో నిక్షిప్తమైందని వెల్లడించింది.

ఈ ఫోటోతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను కూడా పోస్ట్ చేసిన ఆ సంస్థ.. బేస్ క్యాంప్ నుంచి గమనిస్తున్న సమయంలో 10 మంది అంతర్జాతీయ పర్వతారోహకుల బృందం శిఖరం వైపు ముందుకు సాగుతున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయని పేర్కొంది. ‘మా బృందం జూలై 30న ఈ దృశ్యాలను రికార్డు చేసింది. బేస్ క్యాంప్ నుంచి చూస్తున్న మాకు ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు నిర్మల్ ‘నిమ్స్’ పుర్జాతో సహా 10 మంది పర్వతారోహకులు పర్వతాన్ని అధిరోహిస్తున్న తీరు  కనిపించింది’ అని కరకోరం విజన్ తెలిపింది. అయితే ఆ వెంటనే పర్వతంపై భారీ హిమపాతం విరుచుకుపడిందని వెల్లడించింది. ‘మంచు తొలగిపోయిన తర్వాత మేం ఎగువ వాలులను భయంతో పరిశీలించాం. అక్కడ ఎవరూ కనిపించలేదు. బ్రాడ్ పీక్‌పై ఇదొక పెద్ద విషాదం’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

 

సుమారు 5,700 మీటర్ల ఎత్తులో సంభవించిన ఈ హిమపాతం కారణంగా 43 ఏళ్ల పుర్జాతో పాటు ఆయన అంతర్జాతీయ యాత్ర బృందంలోని 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విపత్తు సంభవించిన వెంటనే ఆ బృందంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఆదివారం కఠినమైన వాతావర పరిస్థితుల నడుమ రెస్క్యూ సిబ్బంది పుర్జా మృతదేహాన్ని వెలికితీశారు. అలాగే మరో ఇద్దరు నేపాల్ పర్వతారోహకులు, ఒక చైనా జాతీయునితో సహా నలుగురి మృతదేహాలను కిందకు రవాణా చేస్తున్నట్లు తెలిపారు. మరో ఎత్తయిన ప్రాంతంలో మరో మృతదేహం కూడా గుర్తించామని, అయితే అత్యంత ప్రమాదకరమైన భూభాగ పరిస్థితులరీత్యా ప్రస్తుతానికి అక్కడ నుంచి మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నం చేయడం కష్టమని తెలిపారు.

ఇది కూడా చదవండి: రోడ్డు పక్కన.. ప్లాస్టిక్ కవర్లో నవజాత శిశువు

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)