Breaking News

స్వీట్‌ వార్‌! 

Published on Thu, 11/13/2025 - 06:23

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలవ్వడానికి ఇంకా రెండు రోజులు ఉండగానే పార్టీలన్నీ పండగ వాతావరణంలో మునిగిపోయాయి!  ఫలితం అధికారికంగా 
రాకముందే, గెలుపు సంబరాల కోసం బీజేపీ ఏకంగా 501 కేజీల లడ్డూలు ఆర్డర్‌ చేసిందట. ఇదెక్కడి ఓవర్‌ కాని్ఫడెన్స్‌ అనుకుంటున్నారా? 

ఖుషీఖుషీగా కమలదళం  
ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ ఎన్డీఏకే పట్టం కట్టడంతో, కమలదళం నాయకులకు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ‘కౌంటింగ్‌ రోజు మాకు హోలీ, దసరా, దీపావళి, ఈద్‌.. అన్ని పండగలూ ఒకేసారి వచ్చేస్తాయి!’.. అంటూ బీజేపీ కార్యకర్త కృష్ణ కుమార్‌ కల్లూ తెగ సంబరపడుతున్నారు. ఈ భారీ లడ్డూల ఆర్డర్‌ రావడం నిజమేనని పట్నాలోని మిఠాయి కొట్టు యజమాని కూడా ధ్రువీకరించారు. ఏకంగా 501 కేజీల లడ్డూలను నవంబర్‌ 14 ఉదయం డెలివరీ చేయాల్సి ఉందట. అంటే.. బీజేపీ కార్యాలయాలు మిఠాయి దుకాణలను తలపించబోతున్నాయన్నమాట! 

మర్డర్‌ కేసు అభ్యర్థి ’మాంసం’ విందు! 
ఇదొక్కటే కాదు.. ఈసారి గెలుపుపై ఆశలు పెట్టుకున్న మరో కీలక అభ్యర్థి సంబరం ఇంకాస్త ’గట్టిగా’ ఉంది. జేడీ(యూ)కి చెందిన మోకామా అభ్యర్థి అనంత్‌ సింగ్, ఒక హత్య కేసులో జైలులో ఉన్నప్పటికీ, తన విజయాన్ని ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అనంత్‌ సింగ్‌కు ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఉంది. అందుకే, ఆయన ఈసారి తన మద్దతుదారులు, ఓటర్ల కోసం నవంబర్‌ 14న పటా్నలో భారీ విందు ఏర్పాటు చేశారు. అంతా ఊహించినట్టే జరిగితే, ఆ రోజు అక్కడ పెద్ద మటన్‌ బిర్యానీ పార్టీ జరిగే అవకాశం ఉంది! 

‘లడ్డూలు వెర్సెస్‌ మటన్‌’ వార్‌  
మొత్తానికి, ఓట్ల లెక్కింపు ముందే బిహార్‌లో ’లడ్డూలు వెర్సెస్‌ మటన్‌’ వార్‌ మొదలైందన్నమాట! ఈ అతి విశ్వాసాన్ని చూసి ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్‌ నవ్వుకుంటున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ బీజేపీ అత్యున్నత నాయకత్వం కనుసన్నల్లోనే వస్తున్నాయని కొట్టిపారేస్తున్నారు! నవంబర్‌ 14న కౌంటింగ్‌ తర్వాత ఈ 501 కేజీల లడ్డూలు అందరి నోరు తీపి చేస్తాయో లేక ఈ భారీ ’స్వీట్‌’ ఆర్డర్‌ చూసి మిగిలిన పార్టీలు కన్నీరు పెట్టుకుంటాయో చూడాలి.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Videos

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు