Breaking News

ఆయుధంతో సహా మహిళా కానిస్టేబుల్‌ అదృశ్యం

Published on Thu, 05/23/2024 - 07:45

బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ అదృశ్యమయ్యారు. సీతామర్హిలో మే 20న జరిగిన ఐదో విడత పోలింగ్‌లో ఈ   మహిళా కానిస్టేబుల్‌కు విధులను కేటాయించారు. అయితే ఆమె ఆయుధంతో పాటు అదృశ్యమయ్యారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఈ ఉదంతంపై స్థానిక పోలీసుశాఖలో చర్చలు జరుగుతున్నాయి.

మహిళా కానిస్టేబుల్‌ సుభంతి కుమారి ఘాటో పోలీస్ స్టేషన్‌లోని డయల్ 112లో విధులు నిర్వహిస్తున్నారు. ఈమెకు సీతామర్హిలో ఎన్నికల విధులలో కొన్ని భాధ్యతలు అప్పగించారు. అయితే ఆమె అధికారులకు ఎటువంటి సమాచారం  ఇవ్వకుండా పరారయ్యారు. ఆమె మొబైల్ ఫోన్ కంటిన్యూగా స్విచ్ ఆఫ్ చేసి ఉందని అధికారులు చెబుతున్నారు.

ఈ విషయమై సీతామర్హి ఎస్పీ  సమస్తిపూర్ ఎస్పీకి లేఖ రాశారు. ఎన్నికల విధుల నుంచి సమాచారం లేకుండా అదృశ్యమైన ఈ మహిళా కానిస్టేబుల్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. తాజా సమాచారం ప్రకారం ఈ మహిళా కానిస్టేబుల్‌ సమస్తిపూర్ పోలీస్ సెంటర్‌లో తన దగ్గరున్న ఆయుధాన్ని సమర్పించారు. ఉన్నతాధికారులు ఈ మహిళా కానిస్టేబుల్‌పై చర్యలు చేపట్టనున్నారని తెలుస్తోంది. 

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)