Breaking News

చివరికి.. తోపుడు బండిపై చిన్నారి మృతదేహం తరలింపు!

Published on Sun, 07/09/2023 - 07:23

ఆ ఏడేళ్ల కుర్రాడు పాము కాటుకు గురయ్యాడు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందాడు. కుమారుడు మరణించాడన్న బాధలో ఉన్న అతని తండ్రికి ఊహించని విధంగా మరో సమస్య ఎదురయ్యింది. 

మధ్యప్రదేశ్‌లోని ష్యోపూర్‌లో మానవత్వం మంటగలిసే ఉదంతం చోటుచేసుకుంది. పాము కాటుకు గురైన బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అనంతరం ఆ బాలుడి మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు అంబులెన్స్‌ అందుబాటులో లేదు. మరోమార్గం లేక మృతుని కుటుంబ సభ్యులు ఆ మృతదేహాన్ని తోపుడు బండిపై పెట్టి, రెండున్నర కిలోమీటర్ల దూరంలోని తమ ఇంటికి తీసుకువెళ్లారు. ఈ సమయంలో పెద్దసంఖ్యలో జనం ఆ తోపుడుబండిని అనుసరిస్తూ వచ్చారు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయినా అధికారులు ఈ ఉదంతంపై స్పందించక పోవడం విచారకరం. 

సాహిల్‌ శరీరంలో కదలిక?
విజయ్‌పూర్‌కు చెందిన ఏడేళ్ల సాహిల్‌ ఖాన్‌ను పాము కాటువేసింది. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించాగా, అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని రాత్రంతా పోస్టుమార్టం హౌస్‌లో ఉంచారు. మర్నాడు సాహిల్‌ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. వారికి సాహిల్‌ శరీరంలో కదలిక కనిపించింది. దీంతో వారు వైద్యులకు ఈ విషయాన్ని చెప్పారు. వారు పరీక్షించి, బాలుడు మృతిచెందాడని నిర్థారించారు. తరువాత వైద్యులు ఆ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

మృతుని కుటుంబ సభ్యులు అంబులెన్స్‌ కోసం చాలాసేపు ఎదురు చూశారు. సంబంధిత అధికారులకు ఈ విషయం గురించి చెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో చేసేదేమీలేక నాలుగు చక్రాల తోపుడు బండిపై బాలుని మృతదేహాన్ని ఉంచి, ఇంటికి తరలించారు. ఈ పరిస్థితిని చూసిన స్థానికులు కంటతడిపెట్టుకున్నారు. తరువాత మృతునికి అంత్యక్రియలు నిర్వహించారు. 
ఇది కూడా చదవండి: భర్త చంకలో పిల్లాడు.. భార్య చేతిలో సైకిల్‌.. డెలివరీబాయ్‌ ఫ్యామిలీ వీడియో వైరల్‌!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)