Breaking News

’బార్క్‌’లో నకిలీ శాస్త్రవేత్త.. న్యూక్లియర్‌ డేటా చోరీ?

Published on Thu, 10/30/2025 - 12:36

ముంబై: దేశంలోని ప్రముఖ అణు పరిశోధనా విభాగం భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్‌)లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఈ కేంద్రంలో పనిచేస్తున్నట్లు చెప్పుకుంటున్న ఒక నకిలీ శాస్త్రవేత్తను అరెస్టు చేయడానికి తోడు, అతని నుంచి అనుమానిత న్యూక్లియర్‌  డేటా, 14 మ్యాప్‌లను ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాలలో ఏదైనా గోప్యమైన న్యూక్లియర్‌  డేటా  ఉన్నదీ లేనిదీ తెలుసుకునే దిశగా దర్యాప్తు ప్రారంభించారు.

అక్తర్ కుతుబుద్దీన్ హుస్సేని అనే నకిలీ శాస్త్రవేత గత వారం ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో అరెస్టు అయ్యాడు. అతను వివిధ పేర్లతో శాస్త్రవేత్తగా నటిస్తూ వస్తున్నాడు. అతని నుండి పోలీసులు పలు నకిలీ పాస్‌పోర్ట్‌లు, ఆధార్, పాన్ కార్డులు, నకిలీ బార్క్‌ ఐడీలు స్వాధీనం చేసుకున్నారు. ఒక ఐడీలో అతను అలీ రజా హుస్సేన్‌గా, మరొక దానిలో అతని పేరు అలెగ్జాండర్ పామర్ అని  ఉందని పోలీసులు గుర్తించారు. హుస్సేని గత కొన్ని నెలలుగా పలు అంతర్జాతీయ కాల్స్ చేశాడని, అతని కాల్ రికార్డులను గుర్తించామని పోలీసు వర్గాలు తెలిపాయి. అనుమానిత న్యూక్లియర్‌ డేటాతో ముడిపడిన విదేశీ నెట్‌వర్క్‌లతో హుస్సేని సంబంధం కలిగి ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారని ఎన్‌డీటీవీ తన కథనంలో పేర్కొంది.

హుస్సేని తన గుర్తింపును మార్చుకుని మారువేషంలో చాలాకాలంగా ఉంటున్నాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 2004లో రహస్య పత్రాలు కలిగిన శాస్త్రవేత్తగా గుర్తించి, అతనిని దుబాయ్ నుండి బహిష్కరించారు. అయితే ఆ తర్వాత కూడా అతను నకిలీ పాస్‌పోర్ట్‌లను ఉపయోగించి దుబాయ్, టెహ్రాన్ తదితర దేశాలలో ప్రయాణాలు సాగించాడు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన అఖ్తర్ హుస్సేని 1996లో తన పూర్వీకుల ఇంటిని విక్రయించాడు. అయితే తన పాత పరిచయాల సహాయంతో నకిలీ పత్రాలను రూపొందించాడని పోలీసులు తెలిపారు. ఈ నేపధ్యంలోనే అతను హుస్సేని మొహమ్మద్ ఆదిల్, నసీముద్దీన్ సయ్యద్ ఆదిల్ హుస్సేని పేర్లతో రెండు నకిలీ పాస్‌పోర్ట్‌లను  పొందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జంషెడ్‌పూర్‌ చిరునామాతో ఈ పాస్‌పోర్టులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: Madhya Pradesh: రహస్య కెమెరాలో పోలీసు అధికారిణి.. ఏం చేస్తూ దొరికారంటే..

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)