Breaking News

రూ. 12 కోట్ల గంజాయి : అడ్డంగా బుక్కైన కేరళ బ్యూటీ

Published on Fri, 06/12/2026 - 16:31

పేరు​కే అందాల సుందరి.  చేసేది మాత్రం గలీజ దందా.  28 ఏళ్ల మోడల్, 'మిసెస్ కేరళ' 2025  పోటీదారు  హర్ష సన్నీ  దాదాపు 12 కోట్ల రూపాయల విలువైన గంజాయిని అక్రమంగా తరలిస్తూ అడ్డంగా  బుక్కైంది. బ్యాంకాక్ నుండి విమానంలో    ముంబైకి వస్తూ పోలీసులకు చిక్కింది.

కస్టమ్స్ అధికారుల ప్రకారం, హర్ష సన్నీ జూన్ 10-11 తేదీల రాత్రి ఎయిర్ ఇండియా విమానం TG-351లో బ్యాంకాక్ నుండి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. బ్యాంకాక్‌నుంచి 11 కిలోలకు పైగా  హై క్వాలిటీ  'హైడ్రోపోనిక్ గంజాయి'ని గుట్టుచప్పుడు కాకుండా బాగానే తీసుకొచ్చింది. కానీ  ఆమె  ప్రవర్తనను గమనించిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU), కస్టమ్స్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించగా  అసలు గట్టు రట్టైంది. 

ఇదీ  చదవండి: ఒకే ఒక్కడు మృత్యుంజయుడు.. ఇపుడెలా ఉన్నాడు?

ఆమె ట్రాలీ బాగ్‌లో 12 వాక్యూమ్-సీల్డ్ ప్లాస్టిక్ ప్యాకెట్లు లభించాయి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) కిట్‌ను ఉపయోగించి అక్కడికక్కడే జరిపిన రసాయన పరీక్షలో, ఆ పదార్థం'హైడ్రోపోనిక్ గంజాయి' అని నిర్ధారణ అయింది. విలువ రూ. 11.82 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో  ఆమెను ఎన్‌డిపిఎస్ చట్టం కింద అరెస్టు చేశారు. అనంతరం  కోర్టు ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ సరుకును ముంబైలో లేదా దేశంలోని ఇతర ప్రాంతాలలో ఎక్కడకు చేరవేయాలనుకున్నారనే విషయాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు కొనసాగుతోంది.

ఇదీ చదవండి: కన్నతండ్రినీ, అక్కను ఎప్పటికీ చూడలేని చిన్నారి కన్నీటి కథ!
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)