Breaking News

కి‘లేడీ’ పనిమనిషి.. చోరీ చేసి వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టి..

Published on Thu, 10/17/2024 - 10:21

ముంబై: ఓ పని మనిషి.. తాను పనిచేసే ఓనర్‌లో ఇంట్లో చోరీ చేసి పరార్‌ అయ్యారు. దొంగిలించిన కొత్త వాచ్‌, చీర ధరించిన ఫొటోలు సదరు పని మనిషి వాట్సాప్‌లో స్టేటస్‌ పెట్టుకోగా. ఓనర్‌ దంపతులకు తెలిసిపోయింది. దీంతో పనిమనిషి రూపాలి సింగ్‌పై సమతా నగర్ పోలీస్ స్టేషన్‌లో దొంగతనం కేసు నమోదు చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కండివ్లిలోని ఓ దంపతుల ఇంట్లో.. రూపాలి సింగ్ రెండేళ్లుగా పనిచేస్తున్నారు. ఈ జంట ఈవెంట్ మేనేజ్‌మెంట్ వ్యాపారం చేస్తున్నారు. వారి ఇంట్లో రూపాలి పనిమనిషిగా చేరారు.ఇక.. ఇంటిని శుభ్రం చేయటం, వారి పిల్లలను చూసుకోవడం ఆమె పని. అక్టోబరు 7న రూపాలి.. తల్లిదండ్రులు విడిపోవాలని కోర్టును ఆశ్రయించారని పని మానేసి.. తన సొంతూరు వెళ్తున్నట్లు తెలిపారు.

అయితే.. ఓనర్‌ భార్య దసరాకు కొత్త చీర కట్టుకోవాలని భావించించారు. ఆమెకు కొత్త చీర అల్మారాలో కనిపించలేదు. చీర ఎక్కడ ఉందని.. ఆమె పనిమనిషి రూపాలికి ఫోన్ చేసి కనుకున్నారు. తాను ఇస్త్రీ చేసి అల్మారాలో ఉంచానని రూపాలి చెప్పారు. ఇంట్లో ఎక్కడ చూసినా ఓనర్‌ భార్యకు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి.. అక్టోబర్ 7వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఓనర్‌ దంపతులు.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. యజమాని ఇంటి నుంచి పనిమనిషి రూపాలి.. బ్యాగుల్లో ఏదో తీసుకుని వెళ్తున్నట్లు కనిపించారు. యజమాని భార్య తన వాట్సాప్‌ను తనిఖీ చేస్తుండగా.. సింగ్ స్టేటస్‌ చూసి అవాక్కయ్యారు.

వాట్సాప్‌లో స్టేటస్‌లో పనిమనిషి తన యజమానికి సంబంధించిన వాచ్‌, దుస్తులను ధరించి కనిపించారు. కొత్త చీర, వాచ్‌ కాకుండా ఇంట్లో పలు విలువైన వస్తువులు కనిపించలేదు. ఆభరణాలు, వాచ్, చీరలు, సన్ గ్లాసెస్, శాలువా, మేకప్ కిట్, పెర్ఫ్యూమ్‌లు, పిల్లల బ్యాగ్ కనిపించలేదు. వీటి విలువ సమారు  2.4 లక్షల ఉంటుందని ఓనర్‌ జంట తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాజీ పనిమనిషి కోసం వెతుకుతున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌