Breaking News

రాజధానిలో మహిళల రక్షణకు యాంటీ ఈవ్‌ టీజింగ్‌ స్క్వాడ్‌

Published on Mon, 03/17/2025 - 11:20

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మహిళలకు మరింత రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. యూపీలో అమలు చేస్తున్న యాంటీ రోమియో స్క్యాడ్‌ తరహాలో యాంటీ ఈవ్‌ టీజింగ్‌ స్క్వాడ్‌(Eve Teasing Squad)కు రూపకల్పన చేయనుంది. దీనికి సంబంధించి పోలీసు కమిషనర్‌ ఒక ప్రకటన చేశారు. ఈ స్వ్యాడ్‌కు ‘శిష్టాచార్‌ స​​్క్వాడ్‌’ అనే పేరు పెట్టారు. ఢిల్లీలోని ప్రతీ జిల్లాలో ఈ తరహాలోని రెండు స్క్వాడ్‌లు విధులు  నిర్వహించనున్నాయి.

ఈ ‘శిష్టాచార్‌ స్క్వాడ్‌’లో ఒక ఇన్‌స్పెక్టర్‌, ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఎనిమిదిమంది కానిస్టేబుళ్లు, ఒక హెడ్‌ కానిస్టేబుల్‌ ఉండనున్నారు. వీరిలో నలుగురు మహిళా సిబ్బంది ఉంటారు. వీరిలో సాకేంతిక నిపుణత కలిగిన  ఒకరు ఉండనున్నారు. ఈ స్క్వాడ్‌కు ఒక కారుతో పాటు ద్విచక్రవాహనాలను కూడా సమకూర్చనున్నారు. ఈ స్క్వాడ్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు(Public transport)లో కూడా ప్రయాణించనున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేవిధంగా వారిని మోటివేట్‌ చేయనున్నారు.

2017లో యూపీలోని యోగి సర్కారు రాష్ట్రంలోని మహిళలపై జరిగే వేధింపులను అరికట్టేందుకు యాంటీ రోమియో స్క్వాడ్‌ను నియమించింది. వీరు స్కూళ్లు, కాలేజీల బయట జరిగే ఈవ్‌ టీజింగ్‌ను అరికడుతుంటారు. యాంటీ రోమియో స్క్వాడ్‌లో మహిళా కానిస్టేబుళ్లు సభ్యులుగా ఉంటారు. వీరు మహిళలపై వేధిపులకు పాల్పడేవారిని పట్టుకుని, చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. 

ఇది కూడా చదవండి: Kalpana Chawla: రెండు పుట్టిన రోజుల వ్యోమగామి

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు