Breaking News

2014కు ముందు సర్వం అవినీత, కుంభకోణాలమయం

Published on Tue, 08/22/2023 - 04:39

భోపాల్‌: దేశంలో 2014కు ముందు మొత్తం అవినీతి, కుంభకోణాలే రాజ్యమేలాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పేద ప్రజల హక్కులను, సంపదను విచ్చలవిడిగా దోచుకున్నారని మండిపడ్డారు. పేదల కోసం ప్రభుత్వం కేటాయించిన సొమ్ము వారికి చేరకుండా మధ్యలోనే లూటీ చేశారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ అరాచకానికి తెరపడిందని, ఇప్పుడు ప్రతి పైసా నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లోకే పంపిస్తున్నామని ఉద్ఘాటించారు.

నీతి ఆయోగ్‌ నివేదికను ఆయన ప్రస్తావించారు. గత ఐదేళ్లలో ఏకంగా 13.50 కోట్ల మంది భారతీయులు దారిద్య్ర రేఖ దిగువ(పీబీఎల్‌) కేటగిరీ నుంచి బయటపడ్డారంటూ నీతి ఆయోగ్‌ ప్రకటించిందని గుర్తుచేశారు. దేశంలో పన్నులు చెల్లించేవారి సంఖ్య భారీగా పెరిగిందని అన్నారు. పన్నుల సొమ్మును మంచి పనుల కోసం, దేశ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్న నమ్మకం వారిలో కనిపిస్తోందని చెప్పారు.

సోమవారం మధ్యప్రదేశ్‌లో కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమంలో ప్రధాని వర్చువల్‌గా ప్రసంగించారు. భోపాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ‘అమృతకాలంలో’ తొలి  సంవత్సరం నుంచే సానుకూల వార్తలు రావడం ఆరంభమైందని, దేశంలో సంపద వృద్ధి చెందుతోందని, పేదరికం తగ్గిపోతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌(ఐటీఆర్‌)లు దాఖలు చేసే వారి సగటు వార్షికాదాయం ఆదాయం 2014లో రూ.4 లక్షలు ఉండేదని, ఇప్పుడు అది రూ.13 లక్షలకు చేరిందని వెల్లడించారు. ప్రజలు దిగువ ఆదాయ వర్గం నుంచి ఎగువ ఆదాయ వర్గంలోకి చేరుకుంటున్నారని మోదీ తెలిపారు.  

దేశమంతటా సానుకూల వాతావరణం  
దేశంలో దాదాపు అన్ని రంగాలు బలోపేతం అవుతున్నాయని, అదే స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, నూతన ఉద్యోగాల సృష్టి జరుగుతోందని ప్రధాని చెప్పారు. 2014లో మన దేశం ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని, ఇప్పుడు ఐదో  ఆర్థిక వ్యవస్థగా మారిందని చెప్పారు.  కొత్తగా నియమితులైన 5,580 మంది ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇచి్చంది.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)