Breaking News

కొలువుల్లో వాటా పెరిగింది

Published on Fri, 11/14/2025 - 04:37

భారత్‌లో కృత్రిమ మేధతో (ఏఐ) నడిచే రంగాలు తమ నియామకాల సరళిలోని ప్రాధాన్యాలను మార్చుకోవడంతో ఐదేళ్లలో తొలిసారిగా మహిళల ఉపాధి సామర్థ్యం పురుషులను మించిపోయిందని ఇండియా స్కిల్స్‌–2026 నివేదిక వెల్లడించింది. ప్రధానంగా కంప్యూటర్‌ సైన్స్, ఐటీ, ఇంజనీరింగ్‌ రంగాలు ఉపాధి సామర్థ్యాల కొలమానాల్లో అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 

కంప్యూటర్‌ సైన్స్‌ పట్టభద్రులు 80 శాతం, ఐటీ ఇంజనీర్లు 78 శాతం ఉపాధి సామర్థ్యం కలిగి ఉన్నట్లు తెలిపింది. వారిలో పురుషుల కంటే మహిళా గ్రాడ్యుయేట్స్‌కే నియామకాల్లో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తున్నట్లు పేర్కొంది. ఏఐ, డేటా అనలిటిక్స్, ఆటోమేషన్‌కు సంబంధించిన విభాగాలు మహిళలకు విరివిగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు వివరించింది.    – సాక్షి, స్పెషల్‌ డెస్క్

శిక్షణ ఇప్పించి మరీ..
నిపుణుల కొరతను నిరంతరంగా ఎదుర్కొంటున్న కృత్రిమ మేధస్సు, క్లౌడ్‌ కంప్యూటింగ్, డేటా, సైబర్‌ సెక్యూరిటీ రంగాలలోని సంస్థలు.. సూక్ష్మ–క్రెడెన్షియల్స్‌ (నిర్ధిష్ట నైపుణ్యాలు), పరిమిత స్థాయి యోగ్యతలు కలిగి ఉన్నప్పటికీ మహిళలను నియమించుకుంటున్నాయి. ఏఐ ద్వారా గ్రామీణ ప్రాంతాలలోని మహిళా అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలలోకి తీసుకోవటం, మహిళల నైపుణ్యాలకు ఎక్కువ అవకాశాలకు లభించటం కూడా ఒక కారణమని నివేదిక తెలిపింది.  

ఐదేళ్లలో ముందడుగు..
ప్రస్తుతం మహిళల ఉద్యోగ సామర్థ్యం రేటు 54 శాతం వద్ద ఉంది. ఐదేళ్లలో మొదటిసారిగా పురుషులను దాటి మెరుగైన ప్రతిభను కనబరిచారు. పురుషుల విషయంలో ఈ సామర్థ్యం రేటు 51.5 శాతం ఉంది. బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌), విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలలో మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యం నగరాలు, పట్టణ ప్రాంతాలలో గణనీయంగా పెరిగాయి. 

న్యాయ, ఆరోగ్య సేవల రంగాలలోని ఉద్యోగ అవకాశాలపై మహిళలు వరుసగా 96.4 శాతం, 85.95 శాతం మంది ఆసక్తి చూపుతుండగా; పురుషుల్లో 83.11 శాతం మంది గ్రాఫిక్‌ డిౖజైన్, 64.67 శాతం మంది ఇంజినీరింగ్‌ డిజైన్‌ ఉద్యోగావకాశాల వైపు మొగ్గు చూపుతున్నారు.  

‘ఫాస్ట్‌ మూవింగ్‌..’ లోనూ..! 
ఫార్మాస్యూటికల్స్, హెల్త్‌కేర్‌ వంటి రంగాలు 1–5 సంవత్సరాల అనుభవం ఉన్న మహిళల్ని ఎక్కువగా నియమించుకుంటున్నాయి. ఆ తర్వాతి స్థానాలలో ఎఫ్‌ఎంసీజీ,  బీఎఫ్‌ఎస్‌ఐ మహిళా నియామకాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఐటీలో ఇటీవల గ్రాడ్యుయేట్ల నియామకాలు 35 శాతానికి చేరుకోవడం విశేషం. వీరిలో మహిళలకే కాస్త ఎక్కువగా ప్రాధాన్యం లభిస్తోందని నివేదిక పేర్కొంది. 

కామర్స్‌ గ్రాడ్యుయేట్ల ఉద్యోగ అవకాశాలు గత సంవత్సరం ఉన్న 55 శాతం నుంచి ఈ ఏడాదికి 62.81 శాతానికి పెరిగాయి. సైన్స్, ఆర్ట్స్‌కి సంబంధించిన రంగాలు కూడా ఉద్యోగ అవకాశాల పెరుగుదలను నమోదు చేశాయి. ఈ మూడింటిలోనూ మహిళల భాగస్వామ్యం అధికంగా ఉందని నివేదిక తెలిపింది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)