Breaking News

రథయాత్రలో అపశృతి.. భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగులు

Published on Fri, 06/27/2025 - 12:45

గాంధీనగర్‌: గుజరాత్‌లో జగన్నాథ రథయాత్ర సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. జగన్నాథ యాత్రలో పాల్గొన్న ఒక ఏనుగు ఆగ్రహంతో భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో భయాందోళనకు గురైన భక్తులు ఆలయం నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో, ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట కారణంగా పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం​..  ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్ర ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. కన్నుల పండుగగా జరిగే ఈ యాత్రను చూడడానికి దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ రథయాత్ర సందర్భంగా పలు రాష్ట్రాల్లో కూడా జగన్నాథ ఆలయాల్లో వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్‌లోని గోల్‌వాడలో కూడా భక్తులు రథయాత్రను నిర్వహించారు. అయితే, నిర్వాహకులు యాత్రలో ప్రత్యేక ఆకర్షణకు 18 ఏనుగులను అక్కడికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా యాత్ర ప్రారంభమైన 10 నిమిషాలకు అందులో ఉన్న ఓ ఏనుగు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆగ్రహంతో జనం పైకి దూసుకెళ్లింది.

 

ఇక, సదరు ఏనుగును చూసి పక్కనే ఉన్న ఏనుగులు సైతం ఆగ్రహానికి లోనయ్యాయి. ఒక్కసారిగా అక్కడున్న భక్తులపైకి ఏనుగులు దూసుకెళ్లాయి. దీంతో, ఏనుగులను చూసి అక్కడ ఉన్న వారు భయపడి పరుగులు తీశారు. ఏనుగులు గట్టిగా అరుస్తూ.. అటూ ఇటూ తిరగాయి. ఈ క్రమంలో రథ యాత్ర వద్ద స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఆ ఏనుగులను కంట్రోల్ చేయడానికి మావటివాళ్లు కూడా ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపు కాలేదు. ఎట్టకేలకు పరిస్థితిని అదుపు చేసి రథ యాత్రకు సిద్ధం చేశారు. ఈ ఘటనలో మొత్తం తొమ్మిది గాయపడినట్టు తెలుస్తోంది. చికిత్స కోసం వారిని సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)