Breaking News

ఎన్నికల బాండ్ల డేటాను వెల్లడించిన ఈసీ

Published on Thu, 03/14/2024 - 21:27

న్యూఢిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సమర్పించిన ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. వివిధ రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను తమ అధికారిక వెబ్‌సైట్‌ https://www.eci.gov.in/లో పొందుపరిచింది. ఎవరు ఎన్ని బాండ్లు? ఎంత మొత్తానికి కొనుగోలు చేశారనే వివరాలు ఇందులో ఉన్నాయి.   రూ.891 విలువైన ఎలక్టోరల్‌ బాండ్లను మేఘా సంస్థ కొనుగోలు చేసింది.

ఎలక్టోరల్‌ బాండ్ల వివరాల వెల్లడిలో పారదర్శకంగా ఉన్నామని ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. ఎస్‌బీఐ నుంచి వచ్చిన ఎన్నికల బాండ్ల సమాచారాన్ని మార్చి 15 సాయంత్రంలోగా వెబ్‌సైట్‌లో పెట్టాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం 763 పేజీలతో రెండు పార్ట్‌లుగా వెబ్‌సైబ్‌లో అందుబాటులో ఉంచింది. న్యాయస్థానం ఇచ్చిన గడువుకు ఒక రోజు ముందే డేటాను ప్రచురించింది.

పార్ట్‌-1లో ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు; పార్ట్‌-2లో బాండ్లను ఎన్‌క్యాష్‌ చేసుకున్న పార్టీల వివరాలతో పాటు తేదీ, మొత్తాలకు సంబంధించిన డేటాను ఉంచింది. 

కాగా దేశంలో రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా సమకూరిన నిధుల వివరాలను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేసిన విషయం తెలిసిందే.. 2019 ఏప్రిల్‌ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15 దాకా.. ఐదేళ్లలో 22,217 ఎలక్టోరల్‌ బాండ్లు జారీ చేశామని, వీటిని వ్యక్తులు/సంస్థలు కొనుగోలు చేసి, రాజకీయ పారీ్టలకు విరాళం రూపంలో అందజేశారని వెల్లడించింది. ఇందులో 22,030 బాండ్లను రాజకీయ పారీ్టలు నగదుగా మార్చుకున్నాయని వివరించింది.
చదవండి: బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకీ తలకు తీవ్రగాయం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)