Breaking News

ఓటరు పేరు తొలగింపు అక్రమాలకు ఈ వెరిఫికేషన్‌తో చెక్‌

Published on Thu, 09/25/2025 - 06:12

న్యూఢిల్లీ: ఓటరు జాబితా నుంచి పేర్లను తొలగించాలని కోరే నిబంధనను దుర్వినియోగం చేయకుండా ఎన్నికల సంఘం(ఈసీ) ఈ–ధ్రువీకరణను అందుబాటులోకి తెచ్చింది. ఓటరు జాబితాలోని పేర్లను తొలగించడం లేదా పేర్లను చేర్చడంపై అభ్యంతరాలను వ్యక్తం చేసే వారికి రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు వన్‌ టైమ్‌ పాస్‌వర్డు(ఓటీపీ) అందేలా ఈసీ కొత్త విధానం తీసుకువచ్చింది. 

‘ఓటరు జాబితాలో ఉన్న ఒక పేరును తొలగించాలంటూ ఆన్‌లైన్‌లో అభ్యంతరం వ్యక్తం చేసేవారు వేరే వ్యక్తుల పేరు/ ఫోన్‌ నంబర్‌ను ఇస్తున్నారు. తాజాగా అందుబాటులోకి తెచ్చిన ఫీచర్‌తో ఇలాంటి దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుంది’అని ఓ అధికారి తెలిపారు. ఈ వెసులుబాటును వారం క్రితమే జత చేశామన్నారు. కర్నాటకలో అలండ్‌ నియోజకవర్గంలో ఉద్దేశపూర్వకంగా ఓటర్ల పేర్లను తొలగించారంటూ వచ్చిన ఆరోపణలకు స్పందనగా మాత్రం కాదని ఆ అధికారి స్పష్టం చేశారు. ఓటరు జాబితా నుంచి పేరు తొలగించాలని ఫామ్‌–7ను ఆన్‌లైన్‌లో నింపినంత మాత్రాన ఆటోమేటిక్‌గా పేరు తొలగించడం జరగదన్నారు. 

అలండ్‌ నియోజకవర్గంలో పేరు తొలగించాలంటూ ఫామ్‌–7 దరఖాస్తులు 6,018 అందాయని ఈసీ తెలిపింది. వీటిలో 24 దరఖాస్తులను మాత్రమే సరైనవిగా గుర్తించి, పేర్లను తొలగించామని, మిగతా వాటిని తిరస్కరించామని వివరించింది. కాగా, తాను ఓటు చోరీ ఆరోపణలు చేశాకనే కొత్తగా ఈ–వెరిఫికేషన్‌ను తీసుకువచ్చిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ బుధవారం ఈసీని విమర్శించారు. అలండ్‌ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపునకు సంబంధించిన ఆధారాలను కర్నాటక సీఐడీకి ఎప్పుడు అందజేస్తారంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను ఆయన ప్రశ్నించారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)