Breaking News

ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీ సీరియస్‌

Published on Wed, 05/22/2024 - 17:31

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో స్టార్‌ క్యాంపెయినర్లు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను హెచ్చరించింది. ప్రచార సమయంలో కులం, భాష, మతపరమైన అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం మానుకోవాలని ఇరు పార్టీలకు ఈసీ ఆదేశించింది. ఈ మేరకు ఈసీ ఒక ప్రకటన విడుదల చేసింది.

ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీతో సహా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్టార్‌ క్యాంపెయినర్లకు ఒక నోట్‌ జారీ చేయాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మళ్లికార్జున్‌ ఖర్గే, బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డాలను ఈసీ ఆదేశించింది. వారి ప్రసంగాలను సరి చేసుకొవటంతోపాటు, తగిన శ్రద్ధ వహించాలని తెలియజేయాలన్నారు. వారసత్వంగా వస్తున్న నాణ్యమైన ఎన్నికల ప్రక్రియను దిగజార్చడాన్ని ఊరుకోబోమని ఎన్నికల సంఘం తేల్చి చేప్పింది.

ఎన్నికల ప్రచారంలో బీజేపీ, ఆ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్లు మతపరమైన వ్యాఖ్యలు చేయడాన్ని మానుకోవాలంది. అదే విధంగా కాంగ్రెస్‌ పార్టీ, ఆ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్లు సైతం ఎటువంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా చూసుకోవాలని ఈసీ సూచించింది. అగ్ని వీర్‌ వంటి పథకాలపై ప్రసంగించే సమయంలో  సాయుధ బలగాలకు రాజకీయం చేవద్దని తెలిది. అలా చేస్తే సాయుధ బలగాల సామాజిక, సాంస్కృతిక ప్రతిష్టను దెబ్బతీయటం అవుతుందని కాంగ్రెస్‌పై ఈసీ ఆ‍గ్రహం వ్యక్తం చేసింది.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు