Breaking News

ఆల్‌ టైం హైకి...కొనాలంటే ‘గుడ్లు’ తేలేయాల్సిందే!

Published on Fri, 11/21/2025 - 18:29

ముంబై: మహారాష్ట్రల్లో  కోడి గుడ్ల ధరలు ఆకాశాన్నంటాయి. అటు శీతాకాలం, గుడ్ల మార్కెట్లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో  గుడ్ల ధరలు ఆల్‌ టైం రికార్డ్‌ స్థాయికి చేరాయి. ఛత్రపతి శంభాజీనగర్‌లో గుడ్ల హోల్‌సేల్ ధరలు ఒక్కింటికి దాదాపు రూ. 8 చొప్పున పలుకుతోంది. మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలలో స్వల్ప వ్యత్యాసం ఉన్నప్పటికీ ధరలు మాత్రం హైలో ఉన్నాయని  టోకు వ్యాపారులు  తెలిపారు. దీని ప్రభావం ఉభయ తెలుగురాష్ట్రాల్లో కూడా  ఉంటుందని మార్కెట్‌ నిపుణులు, వ్యాపారులు చెప్పారు. 

శీతాకాలంలో గుడ్ల డిమాండ్ మహారాష్ట్రలో రోజుకు సుమారు మూడు కోట్లు ఉంటుందని అధికారులు , తాజా లోటుతో కారణంగా రోజుకు 1.5 కోట్ల కొరత ఉంటుందని అంచనా.  కోళ్లలో వ్యాధుల వ్యాప్తి  గుడ్ల ఉత్పత్తిని దెబ్బతీసిందని వ్యాపారులు చెప్పారు. వర్షాకాలంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని ప్రధాన సరఫరా కేంద్రాలలో పక్షి సంబంధిత వ్యాధులు వ్యాప్తి చెందడం వల్ల లోటు ఏర్పడిందని పశుసంవర్ధక శాఖ అదనపు కమిషనర్ శీతల్‌కుమార్ ముకానే అన్నారు. 

చదవండి: భారత టెకీ కష్టాలు: రూ. 70 లక్షల ఉద్యోగం పోయింది, సేవింగ్స్‌ కూడా!

వ్యాధులు ప్రబలినప్పటికీ, ఏపీ, తమిళనాడులోని పౌల్ట్రీ యజమానులు కోళ్లను మార్చలేదనీ, ఇది ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. అలాగే చలి వాతావరణం సహజంగానే గుడ్ల వినియోగం , డిమాండ్‌ను పెంచుతుందని కూడా ఆయన చెప్పారు. అయితే ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల నుండి, ముఖ్యంగా తమిళనాడు నుండి గుడ్ల దిగుమతి గణనీయంగా పెరిగిందని ముకానే చెప్పారు. పౌల్ట్రీ ఫీడ్‌లో కీలకమైన మొక్కజొన్న ధర తగ్గిన కారణంగా, ప్రస్తుత మార్కెట్‌ ఉత్పత్తిదారులకు అనుకూలమని పౌల్ట్రీ వ్యాపారవేత్త ఫిరోజ్ పింజారి అన్నారు. 

చదవండి:  ఉదయపూర్‌లో బిలియనీర్‌ కుమార్తె పెళ్లి : జూ. ట్రంప్‌​ స్పెషల్‌ గెస్ట్‌

గత సంవత్సరం ఇదే రోజున నమోదైన రూ. 6.10 6.30 వరకు ఉన్న గుడ్డు ప్రస్తుత హోల్‌సేల్ రేటు గణనీయంగా  పెరిగింది. మారుతున్న వినియోగదారుల అలవాట్లు, గుడ్లలో లభించే అధిక పోషక విలువలు, కల్తీ తక్కువ లాంటి అంశాలు డిమాండ్ పెరగడానికి కారణమని వసంతరావు నాయక్ వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన పౌల్ట్రీ నిపుణురాలు అనితా జింతర్కర్ పేర్కొన్నారు. పౌల్ట్రీ ఉత్పత్తులకు మంచి రేటు లభించడం సానుకూల పరిణామన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)