Breaking News

T Shirts And Jeans Ban: విద్యాశాఖ సంచలన నిర్ణయం.. ఇకపై జీన్స్‌, టీషర్ట్‌లు బ్యాన్‌!

Published on Thu, 06/29/2023 - 19:10

పాట్నా: బీహార్ విద్యాశాఖ జీన్స్, టీషర్ట్ పై నిషేధాన్ని విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, ఇతర సిబ్బంది జీన్స్, టీషర్ట్ ధరించటంపై నిషేధాన్ని విధించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. వివరాల ప్రకారం.. విద్యాశాఖ కార్యాలయాల్లో పని చేసే సిబ్బంది జీన్స్, టీషర్ట్ వంటి క్యాజుబల్స్ ధరించి రాకూడదని ఆదేశించింది.

‘ఉద్యోగులు ఇష్టం వచ్చినట్లుగా దుస్తులు ధరించి ఆఫీసుకు వస్తున్నారు.ఇటువంటి దుస్తులు ధరించి రావటంవల్ల కార్యాలయాల సంస్కృతి దెబ్బతింటోందని’ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇలాంటి దుస్తులు ధరించడం పనిచేసే సంస్కృతికి విరుద్ధమని తెలిపారు. కాబట్టి అధికారులు, ఉద్యోగులందరూ విద్యా శాఖ కార్యాలయాలకు అధికారిక దుస్తులలో మాత్రమే రావాలి. విద్యా శాఖ కార్యాలయాల్లో ఫ్యాషన్‌ ట్రెండీ వంటి దుస్తులు, ముఖ్యంగా జీన్స్, టీ-షర్టులు బ్యాన్‌ చేస్తున్నట్లు తెలిపింది.

ముఖ్యంగా, సరన్ జిల్లా జిల్లా మేజిస్ట్రేట్ ఏప్రిల్‌లో ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆదేశాలను తప్పక పాటించాలని కోరింది. ఫార్మల్ డ్రెస్‌లు ధరించాలని, గుర్తింపు కార్డులు తీసుకెళ్లాలని పేర్కొంది. కాగా బీహార్ ప్రభుత్వం, 2019లో, రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల ర్యాంక్‌లతో సంబంధం లేకుండా జీన్స్, టీ-షర్టులు ధరించడాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. లైట్ కలర్ లో ఉన్న దుస్తులను మాత్రమే ధరించాలని ఉద్యోగులను ఆదేశించింది.

చదవండి: అక్కడకు రాగానే రైళ్లలో లైట్లు బంద్‌.. విచిత్రమో, విడ్డూరమో కాదు!

Videos

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)