Breaking News

ఢిల్లీలో సోదాలకు వెళ్లిన ఈడీ అధికారులఫై దాడి

Published on Thu, 11/28/2024 - 14:04

న్యూఢిల్లీ: ఢిల్లీలో దర్యాప్తు కోసం వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులపై దాడి జరిగింది. మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో సోదాలు చేస్తుండగా సౌత్‌ ఢిల్లీలోని బిజ్వాసన్‌ ప్రాంతంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. యూఏఈకి చెందిన పీపీపీవైఎల్‌  సైబర్‌ క్రైం కేసులో దర్యాప్తులో భాగంగా చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఇంటికి అధికారులు సోదాలు చేసేందుకు వెళ్లారు. బిజ్వాసన్‌ ప్రాంతంలోని ఓ ఫామ్‌ హౌస్‌లో  సోదాలు నిర్వహించారు.

అయితే ఈ కేసులో నిందితుడైన అశోక్‌ శర్మ, తన సోదరుడు, మరికొందరితో కలిసి ఫర్నీచర్‌తో అధికారులపై దాడి చేశారు. అనంతరం దుండగులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఓ అధికారికి స్వల్ప గాయాలయ్యాయి. అతనికి ప్రథమ చికిత్స అందించిన తర్వాత సోదాలు కొనసాగించినట్లు అధికారులు తెలిపారు.

దాడిలో గాయపడిన అధికారిని ఈడీ అదనపు డైరెక్టర్‌గా గుర్తించారు. అనంతరం ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)