Breaking News

అల్‌ఫలా యూనివర్సిటీపై ఈడీ దాడులు

Published on Tue, 11/18/2025 - 08:43

సాక్షి, ఢిల్లీ: ఎర్రకోట పేలుడు కేసులో అల్‌ఫలా యూనివర్సిటీపై మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) దాడులు చేపట్టింది. యూనివర్సిటీకి అందుతున్న నిధులపై  ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.  విశ్వవిద్యాలయానికి, నిషేధిత ఉగ్రవాద సంస్థలకు మధ్య ఉన్న అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల చిట్టాను ఛేదించే లక్ష్యంతో ఢిల్లీ, ఫరీదాబాద్‌లలో ఏకకాలంలో 25 వేర్వేరు ప్రాంతాల్లో ఈడీ బృందాలు మెరుపుదాడులు నిర్వహించాయి.

అల్‌ఫలా విశ్వవిద్యాలయం యజమానులు, సంబంధిత వ్యక్తులపై ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసింది. విశ్వవిద్యాలయం ఆర్థిక లావాదేవీలు, ఫీజుల వసూళ్లు, నిధుల మళ్లింపు తదితర అంశాలపై దర్యాప్తు సంస్థ లోతుగా విచారణ జరుపుతోంది. ఈ దాడులలో కీలకమైన పత్రాలు, డిజిటల్ ఆధారాలు,  ఆర్థిక వివరాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు హమాస్  తరహాలో డ్రోన్ ఆయుధాలతో   దాడులకు ఉగ్రవాదుల ప్లాన్ చేశారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. 

ఈ నేపధ్యంలో అధికారులు డ్రోన్లు, పలు ఆయుధాలను  కనుగొన్నారు. సూసైడ్ బాంబర్ ఉమర్ నబి సహచరుడు జహీర్ బిలాల్ వాణి అలియాస్ డానిష్  అరెస్టు దరిమిలా డ్రోన్ల దాడి ప్రణాళిక వెల్లడయ్యింది. డ్రోన్లకు ఆయుధాలు బిగించడంలో డ్యానిష్ సాంకేతిక సహకారం అందించాడని తేలింది. కారు బాంబు దాడికి ముందు డ్రోన్లకు రాకెట్లు ఉపయోగించాలని ప్రణాళికలు రూపొందించారని సమాచారం. 

రోడ్లకు పవర్ఫుల్ బ్యాటరీలు ఉపయోగించి భారీ ఆయుధాలు, కెమెరాలను  బిగించాలని ప్లాన్ చేశారని తెలుస్తోంది. భారీ ఎత్తున జనం ఉన్న ప్రాంతాలలో  డ్రోన్ల ద్వారా దాడులు చేయాలని ముష్కరులు ప్లాన్‌ చేశారని ఎన్‌ఐఏ అధికారులు కనుగొన్నారు. 2023లో ఇదే  తరహాలో ఇజ్రాయిల్ పై  హమాస్ ఉగ్రవాదులు దాడి చేశారని అధికారులు చెబుతున్నారు.

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు