Breaking News

‘కోల్డ్‌రిఫ్‌’ దగ్గు మందు ఎఫెక్ట్‌.. తమిళనాడులో ఈడీ సోదాలు

Published on Mon, 10/13/2025 - 10:51

చెన్నై: మధ్యప్రదేశ్‌ ‘కోల్డ్‌రిఫ్‌’(Coldrif Syrup) దగ్గు మందు కారణంగా 22 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ‘కోల్డ్‌రిఫ్‌’ దగ్గు మందును తయారు చేస్తున్న తమిళనాడులోని(Tamil Nadu) శ్రీసన్‌ ఫార్మా(Sreesan Pharma) సంస్థపై ఈడీ ఫోకస్‌ పెట్టింది. తాజాగా చెన్నైలో(Chennai) శ్రీసన్‌ ఫార్మాకు సంబంధించిన ఏడు ప్రాంతాల్లో ఈడీ(Enforcement Directorate)  అధికారులు తనిఖీలు చేపట్టారు.

వివరాల ప్రకారం.. చిన్నారుల మరణాలకు కారణమైన ‘కోల్డ్‌రిఫ్‌’ దగ్గు మందును తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రేసన్‌ ఫార్మా యూనిట్‌ తయారుచేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED Raids In Tamilnadu) అధికారులు సోమవారం శ్రేసన్‌ ఫార్మాతో సంబంధమున్న చెన్నైలో ఏడు ప్రదేశాల్లో సోదాలు, తమిళనాడు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారుల నివాసాల్లోనూ తనిఖీలు చేపట్టారు. మనీలాండరింగ్‌ చట్టంకింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు. దగ్గు మందు తయారుచేసిన శ్రేసన్‌ ఫార్మా యూనిట్‌ యజమాని రంగనాథన్(73)ను ఇటీవల అరెస్టు చేసిన తర్వాత ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు.. మధ్యప్రదేశ్‌లో చిన్నారుల మరణాల నేపథ్యంలో శ్రేసస్‌ ఫార్మా కంపెనీలో తనిఖీ చేయగా.. సిరప్‌లో 48.6 శాతం అత్యంత విషపూరితమైన డైఇథైలిన్‌ గ్లైకాల్‌ ఉందని తేలడంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండగా దగ్గు, జలుబు, జ్వరాలతో వెళ్లిన చిన్నారులకు వైద్యులు కోల్డ్‌రిఫ్‌ సిరప్‌ను సూచించగా అందులోని విషపదార్థం వల్ల పిల్లల కిడ్నీలు విఫలమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే కేంద్రప్రభుత్వంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోల్డ్‌రిఫ్‌ను నిషేధించాయి.

ఇదిలా ఉండగా.. ఔషధ తయారీ సంస్థగా ఈ కంపెనీ కేంద్ర పోర్టల్‌లో రిజిస్టర్ కాలేదని దర్యాప్తులో అధికారులు గుర్తించారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) ఇచ్చే గుడ్‌ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్ (GMP) సర్టిఫికెట్ లేకుండానే దశాబ్దాల పాటు ఫార్మా సంస్థ నడిచేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతిచ్చినట్లు తెలిపారు. దీంతో, ఫార్మా కంపెనీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)