Breaking News

మద్యం కుంభకోణంలో ఢిల్లీ మంత్రి కైలాశ్‌ గహ్లోత్‌ను ప్రశ్నించిన ఈడీ

Published on Sun, 03/31/2024 - 05:10

న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు వేగం పెంచారు. దీనితో ముడిపడ్డ మనీ లాండరింగ్‌ కేసులో ఢిల్లీ మంత్రి, ఆప్‌ సీనియర్‌ నేత కైలాశ్‌ గహ్లోత్‌ను ఈడీ శనివారం దాదాపు 5 గంటలపాటు ప్రశ్నించారు. ఆయన వాంగ్మూలం నమోదు చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు సన్నిహితుడైన గహ్లోత్‌ హోం, రవాణా, న్యాయ శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. ఈడీ ఆదేశాల మేరకు శనివారం ఉదయం 11.30 గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. వివాదాస్పద 2021–22 ఢిల్లీ మద్యం పాలసీని రూపొందించిన మంత్రుల బృందంలో గహ్లోత్‌ కూడా ఉన్నారు. చార్జిïÙట్‌లో ఆయన పేరునూ ఈడీ చేర్చింది. మద్యం విధానం ముసాయిదా తయారీ సందర్భంగా ఆప్‌ కమ్యూనికేషన్ల ఇన్‌చార్జి విజయ్‌ నాయర్‌ ఢిల్లీలోని గహ్లోత్‌ అధికారిక నివాసాన్ని ఉపయోగించుకున్నట్లు గుర్తించింది. ప్రజాప్రతినిధికి కేటాయించిన అధికారిక బంగ్లాను మరొకరు వాడటం నేరమేనని, దీనిపై చర్యలు తీసుకోవాలని  సీబీఐకి సూచించింది. గహ్లోత్‌ ఒకే సిమ్‌ కార్డు వాడినా సెల్‌ఫోన్‌ ఐఎంఈఐ నెంబర్‌ మూడుసార్లు మారినట్లు ఈడీ ఆరోపించింది

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)