Breaking News

MLC Kavitha: కవితకు బిగ్‌ షాక్‌.. ఈడీ మరో సంచలన నిర్ణయం!

Published on Sun, 03/24/2024 - 11:25

సాక్షి, నిజామాబాద్‌: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత.. ఈడీ కస్టడీలో ఉ‍న్న విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో ఈడీ స్పీడ్‌ పెంచింది. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు నిజామాబాద్‌పై ఫోకస్‌ పెట్టినట్టు సమాచారం. కవిత ఆస్తులపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. 

వివరాల ప్రకారం.. లిక్కర్‌ స్కాంలో అరెస్ట్‌ అయిన కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో కవిత భర్త, బంధువులపై కూడా నిఘా పెట్టారు. వారికి సంబంధించిన ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈడీ అధికారులు నిజామాబాద్‌కు వెళ్లనున్నట్టు సమాచారం. ఇక, కవిత ఆస్తుల వ్యవహారాలపై సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే, ఆమె భర్త అనిల్‌ వ్యాపార లావాదేవీలు, కవితకు సన్నిహితంగా ఉండే వారి వివరాలను సేకరిస్తున్నారు. 

ఇదే సమయంలో కవిత ఆస్తులకు బినామీలు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ విచారణ చేపట్టారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు పనిచేసి బదిలీ అయిన కీలక అధికారితో పాటు ఓ రెవెన్యూ ఉ‍ద్యోగిపైనా ఈడీ అధికారులు ఫోకస్‌ పెట్టినట్టు సమాచారం. ఇలాంటి అన్ని వివరాల సేకరణ తర్వాత ఈడీ అధికారులు నిజామాబాద్‌కు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మేనల్లుడు మేక శరణ్ పేరును ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లో ప్రస్తావించింది. కవిత ఇంట్లో జరిపిన సోదాల్లో మేక శరణ్ ఫోన్ లభించిందని, రెండు సార్లు పిలిచినా శరణ్ విచారణకు రాలేదని కోర్టుకు ఈడీ తెలియజేసింది. సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో శరణ్ దే కీలక పాత్ర ఉన్నదని మేక శరణ్ కవితకు అత్యంత సన్నిహితుడని, కవిత అరెస్ట్ సమయంలో శరణ్ ఇంట్లోనే ఉన్నారని ఈడీ తన అఫిడవిట్‌లో పేర్కొంది. అరెస్ట్ సమయంలో శరణ్ ఫోన్‌ను సీజ్ చేసి పరిశీలించగా అందులో సౌత్ లాబీకి సంబంధించిన లావాదేవీల సమాచారం గుర్తించినట్లు తెలిపింది. దీంతో ఈడీ అతడిపై దృష్టి సారించింది. ప్రస్తుతం మేక శరణ్ అందుబాటులో లేరని తెలుస్తోంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)