Breaking News

అమెరికా మహిళకు రూ.3.3 కోట్ల టోకరా.. ఈడీ అరెస్ట్‌

Published on Thu, 07/25/2024 - 10:40

ఢిల్లీ: క్రిప్టో కరెన్సీ పేరుతో సైబర్ మోసానికి పాల్పడిన లక్షయ్ విజ్‌(33) అనే వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్‌ చేసింది. లిసా రోత్ అనే అమెరికా మహిళ వద్ద 3.3 కోట్లు దొచుకున్నట్లు లక్షయ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌( ఈడీ) ఆరోపణలు చేసింది. మనీలాండరింగ్‌  చట్టం ప్రకారం జూలై 22 (సోమావారం) లక్షయ్‌ని ఈడీ అదుపులోకి తీసుకున్న తీసుకుంది. అనంతరం అతన్ని ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు జూలై 28 వరకు ఈడీ కస్టడీ విధించింది. మరోవైపు.. అమెరికా మహిళను మోసం చేసిన పలువురిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. దర్యాప్తు చేస్తోంది.

అమెరికాకు చెందిన మహిళను నిందితుడు తాను ఒక మైక్రోసాఫ్ట్ ఉద్యోగిగా చెప్పుకొని సంప్రదించాడు. ఆమె  వాడుతున్న బ్యాంక్‌ అకౌంట్‌ సురక్షితం కాదని నమ్మించాడు. అందులో ఉన్న డబ్బులను  అమె బ్యాంక్‌ ఖాతా నుంచి క్రిప్టో కరెన్సీ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలని ఒప్పించాడు. ఆమె పర్సనల్‌ కంప్యూటర్‌ అనధికారిక యాక్సెస్‌ను సంపాధించి.. ఆమె పేరు మీద క్రిప్టోకరెన్సీ ఖాతాను క్రియేట్‌ చేశారు. ఈ ఖాతాకు 400,000 అమెరికా డాలర్లను బదిలీ చేయాలని తెలిపారు. బాధితురాలు తన బ్యాంక్‌ వివరాలను చెక్‌ చేసుకోగా.. తన డబ్బులు మాయం అయినట్లు గుర్తించారు.

నిందితుడు ఆమె బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి దొచుకున్న డబ్బును వివిధ క్రిప్టోకరెన్సీ వ్యాలెట్లలోకి ట్రాన్స్‌ఫెర్‌ చేసినట్లు ఈడీ విచారణలో తెలిసింది. ఆ డబ్బును  ఇండియన్‌ కరెన్సీలోకి  నిందితులు మార్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ డబ్బు పలు నకిలీ సంస్థలు,  వ్యక్తుల ఖాలా ట్రాన్‌ఫర్‌ అయినట్లు తెలిపారు.

జూన్ 6న  ఈడీ నిర్వించిన సెర్చ్‌  ఆపరేషన్‌లో ఈ కేసుకు సంబంధించిన డిజిటల్‌ ఎవిడెన్స్‌  స్వాధీనం చేసుకున్నారు. నిందితుల పేరుతో రికార్డు అయిన  ట్రాన్జాక్షన్ల ఆధారంగా వారి వద్ద ఈడీ అధికారులు స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. లక్షయ్ విజ్‌.. ప్రధానంగా వాట్సాప్ గ్రూపులను ఉపయోగించి  ట్రాన్జాక్షన్లు చేసిన క్రిప్టోకరెన్సీ హ్యాండ్లర్‌గా ఈడీ అధికారులు గుర్తించారు.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)