Breaking News

రెండుసార్లు ఓటేసిన మహిళ ఆధారాలివ్వండి

Published on Mon, 08/11/2025 - 05:20

బెంగళూరు: గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఓ మహిళ రెండుసార్లు ఓటే సిందంటూ చేసిన ఆరోపణలకు ఆధారాలను అందజేయాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి కర్ణాట క చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి(సీఈవో) లేఖ రాశారు. షకున్‌ రాణి అనే మహిళ రెండుసార్లు ఓటేసినట్లు పోలింగ్‌ అధికారి ఇచ్చిన రికార్డులు చెబుతు న్నాయని రాహుల్‌ కొన్ని పత్రాలను ప్రదర్శించారు. 

ఓటరు ఐడీ కార్డును ఆమె రెండు సార్లు ఉపయోగించుకున్నారు. పోలింగ్‌ బూత్‌ టిక్‌ మార్కు వేశారు’అని అందులో ఉందని రాహుల్‌ ఆరోపించా రు. అయితే, తమ దర్యాప్తుపై షకున్‌ రాణి ఒక్క సారి ఓటేసినట్లు వెల్లడైందని సీఈవో తెలి పారు. టిక్‌ మార్కు పెట్టినట్లుగా రాహుల్‌ గాంధీ చూపిన ఓటరు జాబితా పోలింగ్‌ అధికారి అందజేసిందని కాదని సీఈవో స్పష్టం చేశారు.

 ‘షకున్‌ రాణి లేదా మరొకరు రెండు సార్లు ఓటేశారని ఆరోపిస్తూ మీరు చూపిన పత్రాలను మాకు అందజేయండి. పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతాం’అని రాహుల్‌కు రాసిన లేఖలో సీఈవో కోరారు. లోక్‌సభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, కర్ణాటకలో మహదేవపు రం అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని ఓటరు జాబితాలో దొంగ ఓట్లు నమోదయ్యా యని రాహు ల్‌ ఈసీ లక్ష్యంగా ఆరోపణలు చేయడం తెల్సిందే. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)