Breaking News

బీహార్‌ భూకంపం: 90 ఏళ్ల క్రితం ఇదేవిధంగా.. చెరగని ఆనవాళ్లు

Published on Tue, 01/07/2025 - 12:23

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దు ప్రాంతంలో ఈరోజు (మంగళవారం) భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో 53 మంది మృతి చెందారు. ఈ భూకంప ప్రభావం భారత్‌లోని ఢిల్లీ, బీహార్‌లోనూ కనిపించింది. బీహార్‌లో పట్నా, సమస్తీపూర్‌, సీతామర్హి తదితర జిల్లాల్లో కొన్ని సెకెన్ల పాటు భూమి కంపించింది. ఈ నేపధ్యంలో 90 ఏళ్ల క్రితం బీహార్‌లో సంభవించిన భారీ భూకంపం గురించి తమ పూర్వీకులు చెప్పిన విషయాలను స్థానికులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

1934 జనవరి 15న బీహార్‌లో సంభవించిన భారీ భూకంపం(Major earthquake)  ఆనవాళ్లు ఇప్పటికీ బీహార్‌లో  కనిపిస్తాయి. తాజాగా భూకంపం సంభవించిన దరిమిలా 90 ఏళ్ల క్రితం నాటి బీతావహ భూకంపం జ్ఞాపకాలను స్థానికులు గుర్తుచేసుకున్నారు. బీహార్ ప్రాంతం భూకంపాలకు సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన జోన్‌లో ఉంది. 1934లో సంభవించిన భూకంపం కారణంగా బీహార్ మొత్తం ధ్వంసమైంది. నాటి ఆ భూకంపం మధుబని జిల్లాలోని రాజ్‌నగర్‌ను శిథిలాల నగరంగా మార్చివేసింది. కోసి ప్రాంతంలో రైలు కనెక్టివిటీ విధ్వంసానికి గురైంది. నేటికీ ఇక్కడ నాటి ఆనవాళ్లు కనిపిస్తాయి.

బీహార్‌లో పలుమార్లు భూకంపాలు సంభవించాయి. 1764, 1833లో బీహార్‌ ప్రాంతంలో భూకంపాలు సంభవించినట్లు చరిత్ర చెబుతోంది. బీహార్‌లో 1988, ఆగస్టు 21న 6.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అయితే 1934లో 8.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. బీహార్‌లో భూకంప ప్రభావంపై నిపుణులు(Experts) అధ్యయనం చేసినప్పుడు ముజఫర్‌పూర్, దర్భంగా, ముంగేర్ వంటి జిల్లాల్లో ప్రకంపనలు అధికంగా వచ్చాయని వెల్లడయ్యింది.

1934లో సంభవించిన భూకంపం కారణంగా దర్భంగాలో 1,839 మంది, ముజఫర్‌పూర్‌లో 1,583, ముంగేర్‌లో 1,260 మంది మృతిచెందారు. మొత్తంగా 7253 మంది మృతిచెందారు. దాదాపు 3,400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భూకంప ప్రభావం కనిపించింది. నాటి భూకంపం తీవ్రతకు రాజ్‌నగర్ నగరం పూర్తిగా శిథిలమయ్యింది. ఇప్పటికీ ఈ నగరాన్ని శిథిలాల నగరం అని పిలుస్తారు. నాటి భూకంపంలో దేశంలోని మూడు అత్యుత్తమ ప్యాలెస్‌లలో ఒకటైన రాజ్‌నగర్‌లోని రామేశ్వర్ విలాస్ ప్యాలెస్(Rameshwar Vilas Palace) పూర్తిగా ధ్వంసమైంది.

బీహార్‌లో భూకంపాలు అనేకసార్లు విధ్వంసం సృష్టించాయి. శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ ఎప్పుడైనా పెద్ద ఎత్తున భూకంపాలు సంభవించవచ్చనే ఆందోళనను వ్యక్తం చేశారు. బీహార్‌లోని ప్రతి జిల్లాకు భూకంపం ముప్పు పొంచి ఉంది. 38 జిల్లాల్లో ఎనిమిది జిల్లాలు అత్యంత ప్రమాదకరంగా భావించే జోన్-5లో ఉన్నాయి. ఇక్కడ ఎత్తయిన భవనాలను నిర్మించడాన్ని నిషేధించారు. 

ఇది కూడా చదవండి: నాడు సస్పెండ్‌.. నేడు కుంభమేళా బాధ్యతలు.. ఎవరీ వైభవ్‌ కృష్ణ?

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)