Breaking News

ఇదో విచిత్రమైన ప్రమాదం.. ఎప్పుడైనా చూశారా?

Published on Sat, 11/08/2025 - 20:49

ప్రమాదాలు.. ఈ మధ్యకాలంలో తరచూ నెట్టింట చర్చకు దారి తీస్తున్నాయి. విమాన, ఘోర రోడ్డు ప్రమాదాలు, బస్సులు కాలిపోవడాలు.. జనాల వెన్నుల్లో వణుకులు పుట్టిస్తున్నాయి. తాజాగా.. జమ్ము కశ్మీర్‌లో ఓ విచిత్రమైన ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం కాలేదు.  

జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ సమీపంలో శనివారం ఉదయం రైలు పైకి గద్ద దూసుకొచ్చింది. ఇంజిన్‌ అద్దాన్ని బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేసింది.  ఈ ఘటనలో అద్దాల ముక్కలు గుచ్చకుని లోకో పైలట్ స్వల్పంగా గాయపడ్డాడు. బారాముల్లా–బనిహాల్ ప్యాసింజర్ ట్రైన్ బీజ్బెహారా -అనంత్‌నాగ్ మధ్య ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. 

ఈ ఘటనలో లోకో పైలట్ శ్రీ విషాల్ గాయపడ్డారు. దీంతో అనంత్‌నాగ్ రైల్వే స్టేషన్‌లో ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రైలును క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తిరిగి ప్రయాణానికి అనుమతించారు. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారికంగా ప్రకటించారు. 

అనంత్‌నాగ్ ప్రాంతం పక్షుల సంచారానికి ప్రసిద్ధి. ఈ క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. సాధారణంగా విమానాలను పక్షులు ఢీ కొట్టే ఘటనలు చూస్తుంటాం. కానీ, ఇలా రైళ్లను ఢీ కొట్టడం చాలా అరుదైన అంశం. అందుకే వార్తల్లోకి ఎక్కింది. ఈ ఘటనపై ప్రాంతీయ రైల్వే అధికారులు పూర్తి నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఘటన సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి అదంతా వీడియో తీశారు. ఈ ఘటనకు కారణమైన గద్ద.. లోపలికి వచ్చాక అక్కడే ఓ మూల కూర్చోవడం అందులో చూడొచ్చు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)