Breaking News

తమిళనాడు: ఎమిరేట్స్‌ విమానానికి తప్పిన ప్రమాదం

Published on Wed, 09/25/2024 - 07:42

సాక్షి, చెన్నై: తమిళనాడు ఎమిరేట్స్‌ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యే సమయానికి విమానం నుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే నిలిపివేశారు. దీంతో, ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.

వివరాల ప్రకారం.. చెన్నై విమానాశ్రయం నుంచి దుబాయ్‌ వెళ్లాల్సిన ఎమిరేట్స్‌ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్‌ అయ్యే సమయానికి ఫ్లైట్‌ వింగ్స్‌ భాగం నుంచి పొగ రావడం కనిపించింది. దీంతో, అప్రమత్తమైన పైలట్‌ విమానాన్ని అక్కడే నిలిపివేశారు.

ఈ క్రమంలో అలర్ట్‌ అయిన విమాన సిబ్బంది, టెక్నికల్‌ టీమ్‌ విమానాన్ని పరిశీలించి ప్రమాదాన్ని గుర్తించారు. పది నిమిషాల సమయంలో పొగ ఆగిపోయినట్టు అధికారులు తెలిపారు. అయితే, పొగ రావడానికి గల కారణాలను సిబ్బంది వెల్లడించలేదు. దీంతో, ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. ఇక, రాత్రి 9:15 గంటలకు దుబాయ్‌ వెళ్లాల్సిన విమానం నాలుగు గంటలు ఆలస్యంగా అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత టేకాఫ్‌ అయినట్టు సమాచారం. ఇక, ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 320 మంది ప్రయాణీకులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)