Breaking News

జైపూర్‌లో తప్పతాగి కారు యాక్సిడెంట్

Published on Sat, 01/10/2026 - 10:50

రాజస్థాన్‌లో దారుణం జరిగింది. పుల్‌గా తప్ప తాగిన ఓ వ్యక్తి కారుపై అదుపు కోల్పోయి రోడ్డుపై విచక్షణ రహితంగా కారు నడిపాడు. అతివేగంతో డ్రైవ్ చేస్తూ రోడ్డుపై నడుస్తున్న పాదచారులను ఢీకొట్టి బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు వదలగా 15 మంది గాయపడ్డారు.

మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగే ప్రమాదాలపై ప్రభుత్వాలు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినా పెద్దగా ఫలితం ఉండట్లేదు. తాజాగా రాజస్థాన్ జైపూర్‌లో ఫుల్‌గా తప్పతాగిన ఓబ్యాచ్ ఓవర్‌ స్పీడ్‌తో కారు నడిపారు. వాహనం కంట్రోల్ తప్పి రోడ్డుపై బీభత్సం సృష్టించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మద్యం సేవించిన ఓ వ్యక్తి పుల్‌గా తాగి ఆడి కారు వేగంతో నడిపారు. అనంతరం అదుపు కోల్పోయి రోడ్డపై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టాడు. ఆపై అక్కడే ఉన్న షాపులను గుద్దుకుంటూ పాదచారులపై కారు నడిపాడు. ఈ దుర్ఘటనలో రమేశ్ బైరవ అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 15 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ప్రమాద సమయంలో కారులో నలుగురు వ్యక్తులుండగా అందరూ మద్యం సేవించి ఉన్నారని పోలీసులు తెలిపారు. వారిలో ముగ్గురు ఘటనా స్థలం నుంచి పరారవ్వగా ఒకరిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ విచారం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)