Breaking News

‘నా కుమారుడు కారులో ఎక్కడున్నాడు.. ఆస్పత్రిలో ఉంటే’

Published on Tue, 02/10/2026 - 16:13

లక్నో:  ఉత్తరప్రదేశ్‌లో జరిగిన లంబోర్కిని కారు ప్రమాదంలో తన కుమారుని పాత్ర లేదని అంటున్నారు కాన్పూర్‌ టుబాకో టైకూన్‌ కేకే మిశ్రా. నిన్న జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో  ఈ అంశం చాలా సీరియస్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే కేకే మిశ్రా కుమారుడు శివమ్‌ కారు ప్రమాదానికి కారణమై ఆరుగుర్ని తీవ్రంగా గాయపరిచినట్ల వార్తలు వచ్చాయి. అయితే దీన్ని మాత్రం కేకే మిశ్రా ఖండించారు. ఆ సమయంలో తన కుమారుడు కారులోనే లేడని, ఆస్పత్రిలో ఉన్నాడని మీడియాకు చెప్పుకొచ్చారు.  

కారు ప్రమాదానికి గురి కావడానికి ముందు తన కుమారుడు శివమ్‌ తల తిరగుతూ స్పృహ కోల్పోయాడని,  బౌన్లర్లలో ఒకరు కారు అద్దాలు పగలగొట్టి అతన్ని బయటకి తీసుకొచ్చారు. ఆపై ఇంటికి తీసుకురాగా, అక్కడ నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లామన్నారు. కారును తీసుకురావడానికి ఒక వ్యక్తిని అద్దెకు తీసుకున్నామని, అతని పేరు మోహన్‌ అని పేర్కొన్నారు. కారు కండిషన్‌ సరిగా లేకపోవడంతోనే యాక్సిడెంట్‌ బారిన పడిందన్నారు. 

ఏది ఏమైనా చట్ట ప్రకారమే తాము నడుచుకుంటామన్నారు. అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. మమ్మల్ని విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరవుతామని పేర్కొన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని కేకే మిశ్రా తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో ప్రముఖ పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివం ఆదివారం మద్యం మత్తులో లంబోర్గినిని(DL 8CBC 4018) వేగంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యారనేది వార్తలు వెలుగుచూశాయి. ఆదివారం రాత్రి మద్యం మత్తులో లంబోర్గిని కారు నడిపిన శివం.. హైస్పీడ్‌లో మొదట ఓ ఆటోను ఢీకొట్టి దాదాపు 10 అడుగుల ఎత్తులో గాల్లోకి ఎగిరి రోడ్డుపై ఉన్న పాదచారులు, వాహనాల పైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్లు పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే వీటిని ఖండించారు శివమ్‌ తండ్రి, ప్రముఖ టుబాకో వ్యాపారవేత్త కేకే మిశ్రా.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)