Breaking News

మట్టిలోని జీవమే మన ఆయువు

Published on Fri, 10/23/2026 - 13:27

క్వాంటమ్‌ ఫిజిక్స్‌ నుండి పర్యావరణ ఉద్యమం వైపు తన అడుగులు ఎలా పడ్డాయో ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్‌ వందనా శివ (Dr Vandana Shiva) వెల్లడించారు. 1947 భారతదేశ విభజన సమయంలో తన తల్లిదండ్రుల పోరాటంనుండి నేర్చుకున్న విలువల గురించి మాట్లాడారు. కార్పొరేట్‌ సంస్థల లాభాపేక్ష వల్ల పర్యావరణానికి జరుగుతున్న ముప్పును, వాటికి వ్యతిరేకంగా సాగించే పోరాటంలో నిర్భీతి ప్రాముఖ్యాన్నీ శక్తిమంతంగా వ్యక్తీ కరించారు. ముఖ్యాంశాలు: 

అణువులను వదిలి పర్యావరణానికి!
‘‘నేను క్వాంటమ్‌ సిద్ధాంతాన్ని, పదార్థం ప్రాథమిక స్వభావాన్ని అధ్యయనం చేశానని తెలిసినవాళ్లు... మట్టికి, దేశవాళీ విత్తనాల సంరక్షణకు నేను నా జీవి తాన్ని ఎలా అంకితం చేశానా అని తరచూ ఆశ్చర్యపోతుంటారు. కానీ నా దృష్టిలో, ఇందులో ఎలాంటి వైరుధ్యమూ లేదు. క్వాంటమ్‌ ఫిజిక్సులో మీకు, విశ్వంలోని దేన్నీ వేరు చేసి చూడలేమని చాలా త్వరగా అర్థమవుతుంది. కానీ, పారిశ్రామిక విధానం ప్రకృతిని ప్రాణం లేని, వేర్వేరు తునకల సమూహంగా చూస్తుంది. వాటిని ముక్కలు చేసి, పేటెంట్లు పొంది, అత్యధికంగా వేలం పాడేవారికి విక్రయించవచ్చని భావిస్తుంది. భారతదేశ గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్న పర్యావరణ వినాశనాన్ని, మానవ వేదనను చూసినప్పుడు, ప్రకృతిని ఆక్రమించుకోవడానికి ఈ విచ్ఛిన్నకర సైన్స్‌ ఒక ఆయుధంగా మారుతోందని గ్రహించాను. అందుకే ప్రయోగశాలలో అణు కణాల్ని వదిలేసి, బయటికొచ్చాను.

అమ్మ నేర్పిన  అమూల్యమైన పాఠం
‘‘నా సమగ్ర ప్రపంచ దృక్పథం నా తల్లిదండ్రులు పాటించిన విలువల వల్ల, 1947 నాటి భారతదేశ విభ జన చూపిన తీవ్ర చారిత్రక ప్రభావం వల్ల రూపు దిద్దుకుంది. మా అమ్మ రాత్రికి రాత్రే అంతా కోల్పోయి శరణార్థిగా మారినప్పటికీ, ఆమెలో ఏ విపత్తు కూడా చెరిపివేయలేని అంతశ్శక్తి ఉండేది. ఒకసారి నేను, ‘అమ్మా, నువ్వెందుకు ఖరీదైన దుస్తులు వేసుకోవు?’’ అని అడిగిన సందర్భం నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పుడామె నాకు ఎప్పటికీ మరచిపోలేని ఒక పాఠం నేర్పారు: ‘నేను నా డబ్బును ఖరీదైన చీరలు, నగలపై ఖర్చు చేస్తే, నిన్ను ఎలా చదివించగలను?’ అని! మా నాన్నగారు అటవీ శాఖాధికారి. అడవి అంటే కేవలం కలప మాత్రమే కాదు, అది తనంతట తానుగా మనుగడ సాగించే ఒక సాధువు అని ఆయన నాకు నేర్పించారు. నిజమైన సంపదను మనం మన వ్యక్తిత్వం, జ్ఞానం, ఈ ప్రపంచానికి మనం అందించే సహకారం ద్వారానే కొలవగలమని నా తల్లిదండ్రులు మా మనసుల్లో నాటారు.

ఇదీ చ‌ద‌వండి: నైతిక పీఠంపై 'నిస్సహాయ యోధుడు'

లాభాల వేటలో చౌకబారిన జీవితం
‘‘ప్రస్తుతం మనం ఒక ప్రమాదకరమైన నాగరికతా వలలో చిక్కుకున్నాం. కార్పొరేట్‌ ఆర్థిక వృద్ధిని మానవ పురోగతిగా మనం పొరబడ్డాం. అతి కొద్ది గుత్తాధిపత్య సంస్థలు ఇప్పుడు జీవ వైవిధ్యాన్ని, మూలాలనుపేటెంట్‌ చేసుకోవాలని చూస్తున్నాయి. మన ఆహారాన్ని కృత్రిమంగా తయారు చేయడం, ప్రయోగశాలలో మట్టిని సృష్టించటం, సహజ పర్యావరణ వ్యవస్థలను ప్రైవేటు వస్తువులుగా మారుస్తున్నాయి. ఇది... ప్రకృతి లోపభూయిష్ట మైనదని, కోటానుకోట్ల  సంవత్సరాల పరిణామం కంటే కార్పొరేట్‌ ఇంజనీరింగ్‌ మెరుగైన పని చేయగలదని భావించే అంతులేని దురాశ  మనల్ని నడి పిస్తోంది. లాభమే మానవ విలువకు అంతిమ కొలమానంగా మారినప్పుడు, జీవితమే చౌకైపోతుంది, సమాజాలు నిజమైన పోషకాహారం, నిజమైన సంఘం, అసలైన అర్థం కోసం అలమటించవలసి వస్తుంది.

ఇదీ చ‌ద‌వండి: ఓ స్త్రీగా బతకడం కోసం...

భయాల సంకెళ్లు తెంచుకుందాం
‘‘మీరు శక్తిమంతమైన కార్పొరేట్‌ వ్యవస్థలను సవాలు చేసినప్పుడు, వారు మీకు వ్యతిరేకంగా ఉపయోగించే మొదటి ఆయుధం భయం కల్పించటం. ఒంటరి అయి పోతామనే భయం, చట్టపరమైన బెదిరింపుల భయం, లేదా మీ హోదాను కోల్పోతామనే భయం. నిజమైన కిందిస్థాయి పోరాటం, నిజమైన స్వేచ్ఛ ఆ భయాల ప్రభావానికి గురి కాదు. మీరు ఏదైనా పవిత్రమైన దానికోసం నిలబడినప్పుడు  అది అడవి కావచ్చు, దేశీయ విత్తనం కావచ్చు, లేదా చిన్న రైతు జీవనోపాధి కావచ్చు... మీ బలాన్ని సంస్థల నుండి పొందడం మాని, ఒక శక్తి నుండి పొందడం ప్రారంభిస్తారని నేను ఎప్పుడో తెలుసుకున్నాను. భయం మనల్ని లొంగిపోయేలా, క్రియారహిత వినియోగదారులుగా మారు స్తుంది. నిర్భయత్వం మనల్ని మన ధైర్యంతో మళ్లీ కలుపుతుంది, ఏ కార్పొరేట్‌ లేదా సామ్రాజ్యం శాశ్వతం కాదని; భూమి, మన స్వేచ్ఛ, జీవపు స్థితిస్థాపకత (తిరిగి లేవటం) ఎప్పటికీ నిలిచిపోతాయని మనకు గుర్తుచేస్తుంది.

-ఎడిటోరియల్‌ టీమ్‌

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)