రాణాకు వీఐపీ ట్రీట్మెంట్‌.. బిర్యానీలతో మేపొద్దు

Published on Thu, 04/10/2025 - 14:44

న్యూఢిల్లీ: 26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి,లష్కరే తోయిబా ఉగ్రవాది తహవుర్‌ రాణా (Tahawwur Hussain Rana) భారత్‌కు చేరుకున్నాడు.  అమెరికా నుంచి వచ్చిన తహవుర్‌ రాణాను తీసుకు వచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యింది.   

ఈ తరుణంలో రాణాకు జైల్లో వీఐపీ ట్రీట్మెంట్‌ అంటే ప్రత్యేక సెల్‌, బిర్యానీ వంటి వీఐపీ ట్రీట్మెంట్‌ ఇ‍వ్వకూడదని, అతన్ని ఉరితీయాలని దేశ ప్రజలు సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తహవూర్‌ రాణాను ఉరితీయాలి

వారిలో 2008లో ముంబై ఉగ్రవాద దాడుల నుండి అనేక మందిని ప్రాణాలు కాపాడిన స్థానిక టీసెల్లర్‌ ఛోటు చాయ్ వాలా అలియాస్‌ మహ్మద్ తౌఫిక్ సైతం ఉన్నారు. ఉగ్రవాదులను అంతం చేయాలంటే దేశంలో కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పీటీఐతో మాట్లాడారు. అజ్మల్ కసబ్‌కు ఇచ్చినట్లుగా తహవూర్‌ రాణాకు ప్రత్యేక సెల్ లేదా, బిర్యానీ, ఇతర సౌకర్యాలు అందించాల్సిన అవసరం లేదన్నారు

‘రాణాను భారత్‌కు తీసుకుని రావడం శుభపరిణామం. కానీ అతనిని 15 రోజుల్లో లేదా రెండు మూడు నెలల్లో బహిరంగంగా ఉరితీయాలి. ఇలాంటి ఉగ్రవాదులకు ఎటువంటి ప్రత్యేక వసతులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అజ్మల్‌ కసబ్‌కు జైల్లో అందించిన వీఐపీ ట్రీట్మెంట్‌ ఇవ్వకూడదు. ఇలాంటి వారిపై కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వృధా. రాణాను ఉరితీసేవరకు తాను ఎదురు చూస్తాను. నాటి ఉగ్రదాడి బాధితులకు ప్రభుత్వం సహాయం అందించింది. కానీ డబ్బుతో ప్రాణాల్ని తిరిగి తెచ్చుకోలేం కదా?’ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తహవూర్‌ రాణాను భారత్‌కు అప్పగించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  

ఉగ్రమూకల నుంచి ప్రజల్ని కాపాడి
2008 నవంబర్‌లో ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు దక్షిణ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్‌ సమీపంలో మహ్మద్ తౌఫిక్ టీ స్టాల్ నడుపుతున్నారు.ఆ సమయంలో ఉగ్రవాదులు దాడిలో ప్రాణాలు కోల్పోతున్న ప్రజల్ని చూసిన తౌఫిక్‌ అప్రమత్తమయ్యారు.వెంటనే వారిని ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారని,జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారిని సురక్షితంగా ఉగ్రవాదుల నుంచి తప్పించారు. అప్పటికే ముష్కరుల చేతిలో గాయపడిన బాధితుల్ని ఆస్పత్రి తరలించారు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)