Breaking News

అత్యంత చెత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

Published on Wed, 02/21/2024 - 09:53

అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024, నవంబర్ 5న జరగనున్నాయి. రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ పార్టీ నేత జో బైడెన్‌ మధ్యేనే ఈ అధ్యక్ష ఎన్నికల్లో ప్రధానంగా పోటీ కనిపిస్తోంది. ఇదిలావుండగా  అమెరికాను ఇప్పటి వరకూ ఏలిన మొత్తం 45 మంది అధ్యక్షులలో డొనాల్డ్ ట్రంప్  అత్యంత చెత్త అధ్యక్షునిగా అభివర్ణిస్తూ ఒక సర్వే  ఫలితాలు వెలువడ్డాయి. 

ఈ జాబితాలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌  14వ స్థానంలో నిలిచారు. అంతర్యుద్ధాన్ని ఆపడంలో లేదా ఆ పరిస్థితి నుండి బయటపడేయడంలో విఫలమైన వారి కంటే కూడా డొనాల్డ్ ట్రంప్ వెనుకబడి ఉన్నారు. ఈ సర్వేను నిర్వహించిన రాజకీయ విశ్లేషకులు జస్టిన్ వాన్, బ్రాండన్ రోటింగ్‌హాస్ మాట్లాడుతూ బైడెన్‌ సాధించిన విజయాలలో.. ట్రంప్ నుండి అధ్యక్ష పదవిని కాపాడటమే ప్రధానమైనదని పేర్కొన్నారు.

యూనివర్శిటీ ఆఫ్ కోస్టల్ కరోలినాకు చెందిన వాన్, హ్యూస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన రోటింగ్‌హాస్ తదితర 154 మంది రాజకీయ విశ్లేషకులు ఈ సర్వే  నిర్వహించారు. వీరు అమెరికన్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్‌తో సత్సంబంధాలు కలిగివున్నారు. అమెరికాలోని ఉత్తమ అధ్యక్షునిగా అబ్రహం లింకన్ నిలిచారు. ఆయన దేశంలో బానిసత్వాన్ని నిర్మూలించడంతోపాటు అంతర్యుద్ధం సమయంలో దేశాన్ని సమర్థవంతంగా నడిపించాడని విశ్లేషకులు పేర్కొన్నారు. మరో ఉత్తమ అధ్యక్షునిగా ఫ్రాంక్లిన్ డెలానో రూజ్‌వెల్ట్ నిలిచారు. ఆర్థిక మాంద్యం, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికాకు సరైన మార్గనిర్దేశం చేశాడని విశ్లేషకులు తెలిపారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)