Breaking News

మెలోనిపై మరోసారి మండిపడ్డ ట్రంప్

Published on Sun, 06/21/2026 - 08:53

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇటలీ ప్రధాని మెలోని మధ్య వైరం రోజురోజుకు ముదురుతుంది. తాజాగా మెలోని వ్యాఖ్యలకు ట్రంప్ కౌంటరిచ్చారు. ఇటలీలో ఆమె పనులు సరిగ్గా లేవని అందుకే ఆమె.. తనను విమర్శిస్తూ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారన్నారు. అయితే దీనికి మెలోనీ సైతం కౌంటరిచ్చింది. తన ప్రజాదారణతో మీకేం పని అని ట్రంప్‌ను ప్రశ్నించింది.    

డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఇటలీ ప్రధానిపై చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య అగ్గి రాజేస్తున్నాయి.. ట్రంప్ వ్యాఖ్యలను మెలోని ఇదివరకే ఖండించగా మరోసారి సోషల్‌ మీడియా వేదికగా ట్రంప్ రెచ్చిపోయారు.

తన సోషల్ మీడియా ట్రూత్‌ వేదికగా స్పందిస్తూ.."ఇటలీలో మెలోని ప్రజాదరణ చాలా బలహీనంగా ఉంది. ఇరాన్ అణుబాంబు తయారీని అడ్డుకునే విషయంలో ఆమె అమెరికాకు మద్దతు ఇవ్వకపోవడమే దీనికి కారణం కావచ్చు. నిజానికి ఇటలీని అమితంగా ప్రేమించేది, రక్షించేది అమెరికా మాత్రమే ఆ మాటకు వస్తే నాటో కూడా ఇరాన్ విషయంలో అలాగే వ్యవహరించింది" అని రాసుకొచ్చారు.

అదేవిధంగా యుద్ధ సమయంలో ఇటలీకి చెందిన రన్‌వేలను లేదా ల్యాండింగ్ స్ట్రిప్స్‌ను అమెరికా వాడుకోకుండా మెలోని అడ్డుకున్నారని ఆరోపించారు.  ఇటలీతో పాటు ఇతర నాటో కూటమి దేశాల రక్షణ కోసం అమెరికా ప్రతిటా వందల బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ మెలోని కనీసం మా విమానాలు ల్యాండ్ అవ్వడానికి కూడా అనుమతించలేదు. ఇది మాకు తీవ్రమైన రవాణా ఇబ్బందిని కలిగించిందని.. ఇప్పుడు తన ప్రజాదరణ రేటింగ్‌లను పెంచుకోవడం కోసమే ఆమె నాతో స్నేహం నటిస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు.

మెలోని స్పందన

ట్రంప్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అంతే తీవ్రంగా స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె ట్రంప్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. "ఇలాంటి కారణం లేని, నిరంతర దాడులు అర్థరహితమైనవి. మీతో స్నేహం చేయడం వల్ల నా ప్రజాదరణ పెరిగిందేమీ లేదు, అది మీతో ఉండే సంబంధాలపై ఆధారపడి కూడా లేదు. ఇటలీ జాతీయ ప్రయోజనాలను కాపాడటంలో నాకున్న సామర్థ్యంపైనే నా ప్రజాదరణ ఆధారపడి ఉంటుంది. నేను ఎప్పుడూ దాన్నే చేస్తూ వచ్చాను" అని మెలోని స్పష్టం చేశారు.

ఏది ఏమైనప్పటికీ, నా ప్రజాదరణ గురించి మీకేం అవసరం లేదు. దానికి బదులు మీ పాపులారిటీపై మీరు దృష్టి పెడితే మంచిదని నా సూచన అంటూ మెలోని ట్రంప్‌పై విరుచుకుపడ్డారు.

వివాదం ఎలా మెుదలైందంటే..

ట్రంప్‌ మాట్లాడుతూ " నేను మెలోనితో మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఆమె నాతో ఫోటో దిగాలని ఎంతగానో తపించింది. నేను అసలు ఫోటో దిగకూడదనే అనుకున్నాను, కానీ ఆమెను చూసి జాలిపడి మాట్లాడాను. నాతో మాట్లాడినందుకు ఆమె ఇప్పుడు సంతోషంగానే ఉండి ఉంటుంది" అని అన్నారు.  

దీనికి ఘాటుగా బదులిచ్చిన మెలోని "డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా కల్పితాలు, ఈ ప్రవర్తన నన్ను ఆశ్చర్యపరిచింది. అమెరికా అధ్యక్షుడు తన సొంత మిత్రదేశాల పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తారో అర్థం కావడం లేదు. అయితే పాశ్చాత్య దేశాల శత్రువుల పట్ల, అమెరికా శత్రువుల పట్ల ఆయన ఇంత పట్టుదల చూపించకపోవడం విచారకరం. నేను గానీ, నా దేశం ఇటలీ గానీ ఎవరిముందూ ఎన్నటికీ మోకరిల్లం, బతిమాలం" అని మెలోని తేల్చిచెప్పారు.

 

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)