Breaking News

యజమానురాలు తిట్టిందని.. తల్లీ కుమారులపై సహాయకుని ఘాతుకం

Published on Thu, 07/03/2025 - 12:23

న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలోని లజ్‌పత్ నగర్-Iలో ఘోరం చోటుచేసుకుంది. ఎంతో నమ్మకంతో ఇంటి పనిలో పెట్టుకున్న సహాయకుడే యజమానురాలితో పాటు, ఆమె కుమారుని గొంతు కోశాడు. యజమానురాలు తిట్టిందని, ఆగ్రహంచిన ఆ సహాయకుడు ఇంతటి దారుణానికి తెగించాడు.

లజ్‌పత్ నగర్‌లో బుధవారం రాత్రి  ఒక మహిళ, ఆమె కుమారుడు వారి ఇంటి లోపల హత్యకు గురయ్యారనే వివరాలు తెలియగానే, రంగంలోకి దిగిన పోలీసులు వారి ఇంటి నుంచి పరారైన సహాయకుడు ముఖేష్‌(24)ను అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించగా, నేరాన్ని అంగీకరించడంతోపాటు ఘటనాక్రమాన్ని పోలీసులకు వివరించాడు. తన యజమాని రుచికా సేవ, ఆమె కుమారుడు క్రిష్‌ల గొంతులను కోసినట్లు నిందితుడు ముఖేష్‌  పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.


 

రుచిక భర్త కుల్దీప్ రాత్రి 9:30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు.. ఆయనకు మెట్లపై రక్తపు మరకలు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు లోపలి నుంచి లాక్‌ చేసి ఉన్న తలుపును బలవంతంగా తెరిచారు.  అక్కడ వారు రుచిక మృతదేహాన్ని బెడ్‌రూమ్‌లో,  క్రిష్ మృతదేహాన్ని బాత్రూంలో  గుర్తించారు. ఇద్దరికీ మెడపై కత్తితో చేసిన గాయాలన్నాయి. ఈ ఘటనకు వారింటిలో పనిచేసే ముఖేష్‌ కారణమని భావించిన పోలీసులు అతనిని పట్టుకున్నారు. ప్రాథమిక విచారణలో ముఖేష్ తనను యజమానురాలు  రుచిక తిట్టిందునే ఈ దారుణానికి పాల్పడ్డానని తెలిపాడు.  మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: కన్వర్ యాత్రకు అవే నిబంధనలు.. మళ్లీ వివాదం తలెత్తేనా?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)