Breaking News

ముంచుకొచ్చిన ఉపద్రవం.. ఊరినే కాపాడిన కుక్క!!

Published on Tue, 07/08/2025 - 13:39

భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు.. హిమాచల్‌ ప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. వీటికి తోడు కొండచరియలు విరిగిపడుతుండడంతో.. అక్కడి ప్రజల జీవనం కష్టతరంగా ఉంటోంది. మరోవైపు వర్షాలకు ఇప్పటిదాకా 75 మంది మరణించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఊరకుక్క 67 మంది ప్రాణాలను కాపాడింది!!. వివరాల్లోకి వెళ్తే..

హిమాచల్‌లో కురుస్తోన్న భారీ వర్షాలతో మండి జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. అక్కడి ధరంపూర్‌ తాలుకా సియతి గ్రామం జూన్ 30న అర్ధరాత్రి సమయంలో పెద్ద కొండచరియ విరిగిపడడంతో సర్వనాశనమైంది.  ఇళ్లు ధ్వంసం కావడంతో గ్రామస్థులంతా తియంబాలా గ్రామంలోని నైనాదేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. సర్వం కోల్పోయినా.. ఓ ఊరకుక్క కారణంగా ప్రాణాలు దక్కాయని చెబుతున్నారు వాళ్లు. ఆ రాత్రి ఏం జరిగిందో ఓ గ్రామస్తుడి మాటల్లో..  

మా ఇంటి రెండోఅంతస్తులో ప్రతిరోజు ఓ శునకం నిద్ర పోయేది. అయితే ఆరోజు అర్ధరాత్రి భారీ వర్షం కురుస్తోంది. ఆ వర్షంలో అది విపరీతంగా అరవడం మొదలుపెట్టింది. భయంతో అరుస్తుందేమోనని ఆ అరుపుల శబ్దానికి నేను లేచి దాని దగ్గరకు వెళ్లాను. పైకి వెళ్లి చూడగా.. ఇంటిగోడకు పగుళ్లు కనిపించాయి. ఇంట్లోకి చిన్నగా నీరు రావడం మొదలైంది. దాంతో వెంటనే కుక్కను కూడా కిందికి పరిగెత్తా. 

ఇంట్లో వాళ్లను.. చుట్టుపక్కల అందరినీ లేపి సురక్షిత ప్రాంతానికి వెళ్లమని చెప్పాను. అలా దూరంగా వెళ్లామో, లేదో.. మా గ్రామంపై ఓ పెద్ద కొండచరియ విరిగిపడింది. పదుల సంఖ్యలో ఇళ్లు దానికింద నేలమట్టం అయ్యాయి అని చెప్పారాయన. అలా కుక్క అరుపు.. 20 కుటుంబాలకు చెందిన 67 మంది ప్రాణాలను రక్షించిందన్నమాట. 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)