కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?
Breaking News
Air India Incident: దర్యాప్తులో RAT కీలక పాత్ర పోషించనుందా?
Published on Tue, 06/17/2025 - 17:57
న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో జూన్ 12వ తేదీన జరిగిన విమాన ప్రమాదం అతి పెద్ద విషాదంగా మారిపోయింది. ఆ విమానంలో ఉన్న 241 మందితో పాటు బయట ఉన్న మరో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల సంఖ్య 274కు చేరింది. అయితే ఈ దుర్ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో విమానంలో ఒకేసారి రెండు ఇంజన్‌లు పనిచేయకపోవడం ఆసక్తికరంగా మారింది.
అసలు డ్యుయల్ ఇంజన్‌తో నడిచే విమానాల్లో ఒక ఇంజన్ పని చేయని పక్షంలో మరో ఇంజన్ పునరుద్ధరించబడుతోంది. ఇది సెకన్లలో జరిగే ప్రక్రియ. ఇందుకు RAT(Ram Air Turbine) దోహదం చేస్తుంది. ఇప్పుడు దీనిపైనే సర్వత్రా చర్చ నెలకొంది. రెండు ఇంజన్లలో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగానే ఇది జరిగి ఉండవచ్చని అధిక శాతం మంది విమాన రంగ నిపుణులు చెబుతున్నప్పటికీ, ఇలా జరిగినప్పుడు RAT ఎంతవరకూ పని చేసిందనేది మరో కోణంలో చర్చకు తెరలేపింది.
ఎయిర్‌లైన్స్‌లో RAT అంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్ (Ram Air Turbine). ఇది విమానంలో ఒక చిన్న టర్బైన్, ఇది విమానం యొక్క ప్రాథమిక శక్తి వనరులు విఫలమైనప్పుడు ఉపయోగించబడుతుంది. ఇది విమాన నియంత్రణ వ్యవస్థలతో పాట ఇతర ముఖ్యమైన భాగాలకు శక్తిని అందించి తిరిగి గాడిలో పడేందుకు ఉపకరిస్తుంది.
విమానంలో ఆటోమేటిక్‌గా పని చేసే RAT.. డ్యూయల్ ఇంజిన్ వైఫల్యం, విద్యుత్ వైఫల్యం లేదా హైడ్రాలిక్ వైఫల్యం సంభవించినప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ RAT ఎంతవరకూ పని చేసిందనేది ప్రధాన ప్రశ్న.
గేర్‌లను విస్తరించడానికి లేదా ఉపసంహరించుకోవడంతో పాటు విద్యుత్ శక్తిని పునరుద్ధరిస్తుంది. కీలకమైన విద్యుత్ వ్యవస్థలను నిర్వహించడంలో సహాయపడటానికి తగినంత శక్తిని ఉత్పత్తి చేయడానికి రూపొందించబడిన RAT.. ఇప్పుడు దర్యాప్తులో కీలకం కానుంది.
విమాన ప్రమాదం జరిగే సమయంలో RAT యాక్టివేట్ అయ్యిందనే చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు ప్రమాద ఘటన వీడియోల్లో కూడా కనిపించింది. అయితే విమానం గాల్లోకి టేకాఫ్ తీసుకున్న సెకన్ల వ్యవధిలోనే కూలిపోవడంతో RAT యాక్టివేట్ అయినా అది విఫలంగానే మిగిలిపోయిందనేది మరో వాదన.
టెన్షన్.. టెన్షన్.. మరో ఎయిర్ ఇండియా విమానం రద్దు
Tags : 1