Breaking News

వీడియో: వైద్యుడి రీల్స్‌ పిచ్చి.. ఆసుపత్రిలో మహిళ మృతి

Published on Wed, 01/29/2025 - 15:44

లక్నో: ఓ వైద్యుడి రీల్స్‌ పిచ్చి మహిళ ప్రాణాలను తీసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళను రక్షించాల్సిన వైద్యులు సోషల్‌ మీడియా చూస్తూ బిజీగా ఉండటంతో సదరు మహిళ చనిపోయింది. సరైన సమయంలో వైద్యుడు స్పందించి ఉంటే ఆమె ప్రాణాలతో ఉండేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. యూపీలోకి మైన్‌పురి జిల్లాకు చెందిన ప్రవేశ్ కుమారి(60) అనే మహిళకు మంగళవారం ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆమెను వెంటనే సమీపంలోని మహారాజా తేజ్‌సింగ్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో డాక్టర్‌ ఆదర్శ్‌ సెంగార్‌ డ్యూటీలో ఉన్నారు. దీంతో, బాధితులు ఆదర్శ్‌ను సంప్రదించారు. దీంతో, ఓ నర్సును బాధితురాలి వద్దకు పంపి.. డాక్టర్‌ మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌, ఫేస్‌బుక్‌లో రీల్స్‌ చూస్తూ కూర్చున్నాడు. ఈ క్రమంలో మహిళ కుటుంబసభ్యులు వైద్యం చేయాలని అడిగినా పట్టించుకోలేదు. ఐదు నిమిషాల పాటు బాధతో విలవిలలాడిన బాధితురాలు సరైన వైద్య సహాయం అందకపోవడంతో ప్రాణాలు కోల్పోయింది.

ప్రవేశ్‌ కుమారి మృతి చెందడంతో ఆగ్రహించిన మృతురాలి కుటుంబసభ్యులు డాక్టర్‌పై దాడి చేశారు. దీంతో ఆస్పత్రికి సిబ్బందికి, వారికి మధ్య వివాదం నెలకొంది. వైద్యం చేయమని పదే పదే అడిగినా తమ తల్లి ప్రాణం పోయేదాకా డాక్టర్‌ రీల్స్‌ చూస్తూ కూర్చున్నాడని మృతురాలి కుమారుడు గురుశరణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ తల్లికి ఎందుకు వైద్యం చేయలేదని ప్రశ్నించినందుకు వైద్యుడు తమపై దాడి చేశాడని పేర్కొన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వైద్యుడిపై కేసు నమోదు చేశారు. చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (సీఎంఎస్) ఆధ్వర్యంలో సీసీటీవీని పరిశీలిస్తున్నామని.. ఆరోపణలు నిజమని తేలితే వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సదరు వైద్యుడిపై చర్యలు తీసుకుంటారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

 

 

Videos

చంద్రబాబు గుర్తుపెట్టుకో.. చీర లాగి.. ఇంత దారుణంగా కొడతారా..? జనసేన నేత వార్నింగ్

ప్రసాద్ బాబుకు ఒక న్యాయం.. ఇందిరకు మరో న్యాయమా?

విడుదల రజిని ఘటనపై ధ్రువ్ రాఠీ స్పందన

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

Photos

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు