తమిళనాట పెరిగిన పొలిటికల్ హీట్

Published on Tue, 01/06/2026 - 16:36

సాక్షి చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవ‍త్తరంగా మారుతున్నాయి. అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీ మధ్య సీట్ల పంపకాలపై సంప్రదింపులు మొదలైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ 40 అసెంబ్లీ స్థానాలు డిమాండ్ చేస్తుండగా.. డీఎంకే అందుకు ఇంకా స్పందించలేదు. ఒకవేళ సీట్ల పంపకం తేలనిపక్షంలో విజయ్‌ టీవీకే పార్టీతో జట్టు కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిస్తోంది.

తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలలో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ పార్టీలు పొత్తుల బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. అధికార డీఎంకేతో కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నాయి. దీంతో సీట్ల షేరింగ్ అంశంపై రెండుపార్టీల మధ్య ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ 40 అసెంబ్లీ సీట్లు తమ పార్టీకి కేటాయించాలని డీఎంకేను కోరినట్లు తెలుస్తోంది. అయితే స్టాలిన్‌ పార్టీ 32 సీట్లు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్‌ కనీసం 38 స్థానాలకైనా పరిమితం కావాలని భావిస్తోందట. కాంగ్రెస్ సీనియర్‌ నేత మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ "కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని  కోరుకుంటోంది" అని వ్యాఖ్యానించారు. దీంతో సీట్ల పంపకాల్లో కాంగ్రెస్‌ తగ్గే ప్రసక్తే కనిపించడం లేదు.

ఇటు కాంగ్రెస్ పార్టీ విజయ్‌ పార్టీ టీవీకేతో పొత్తుపెట్టుకునే అవకాశాల్ని పూర్తిగా కొట్టిపడేసే అవకాశాలు లేవు. ఇటీవల ఆ పార్టీ అధికార ప్రతినిధి ఫిలిక్స్ గెరాల్డ్ మాట్లాడుతూ " కాంగ్రెస్, టీవీకే పార్టీలు సహజమిత్రులు. రాహుల్ గాంధీ, విజయ్ మంచి స్నేహితులు,  రెండు పార్టీల మధ్య పొత్తు అవకాశాలు అధికంగా ఉన్నాయి" అని వ్యాఖ్యానించడం కలకలమే రేపింది. దీంతో.. బీజేపీ రంగంలోకి దిగింది. 

బీజేపీ సైతం విజయ్ పార్టీతో పొత్తుకోసం ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల తమిళనాడులో పర్యటించిన అగ్రనేత, హోం మంత్రి అమిత్‌షా ఉద్దేశపూర్వకంగానే అన్నాడీఎంకే ప్రదాన కార్యదర్శి పళనిస్వామిని కలవకుండా వెళ్లినట్లు ప్రచారం నడుస్తోంది. పొత్తుల అంశంపై తమ అధినేత విజయ్‌తో చర్చించాకే ఏ నిర్ణయమనేది ప్రకటిస్తామని టీవీకే నేతలు చెబుతుండడం గమనార్హం.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)