Breaking News

కర్ణాటక మంత్రి వర్గంలో కలకలం.. రంగంలోకి దిగిన డీకే

Published on Fri, 06/05/2026 - 16:18

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు తీసుకున్న రెండు రోజులకే ఆయనకు షాక్ తగిలింది. నూతన మంత్రి వర్గంలో తనకు సరైన ‍ప్రాధాన్యత కల్పించలేదని ఆ పార్టీ సీనియర్ నేత మంత్రి రామలింగారెడ్డి రాజీనామా చేశారు. ఈ చర్యలతో శివకుమార్‌కు ఆదిలోనే హంసపాదు తగిలినట్లయింది. దీనిపై తాజాగా ఆయన స్పందించారు. దీనిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్... సీఎం కుర్చీ కోసం ఎంతగా కష్టపడ్డారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది చివరలో మెుదలైన ఈ రాజకీయ రగడ ఎట్టకేలకు శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో శాంతించిందని చెప్పుకోవ‍చ్చు. అయితే ఆయన క్యాబినెట్‌ విస్తరణలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ సీనియర్ నేత మంత్రి రామలింగారెడ్డి రాజీనామా చేయడం  ఆ రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. దీంతో శివకూమార్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

ఈ అంశమై డీకేశివకుమార్ మాట్లాడుతూ.. "ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన నాకు గొప్ప స్నేహితుడు. కేబినెట్‌లో మేమే అత్యంత సన్నిహిత మిత్రులం. ఈ సమస్యను పరిష్కరిస్తాం. రామలింగారెడ్డి నా సహచరుడు, మా సీనియర్ నాయకుడు. ఆయన గ్రామానికి వెళ్లి పని చేయలేనని చెప్పారు. నాకు వేరే మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. నేను రామలింగారెడ్డితో మాట్లాడి అంతా సరిచేస్తాను," అని డీకే చెప్పుకొచ్చారు.

CM DK శివకుమార్ కు బిగ్ షాక్.. కేబినెట్లో దెబ్బ మీద దెబ్బ

కాగా బృహత్ బెంగళూరు అభివృద్ధి (గ్రేటర్ బెంగళూరు డెవలప్‌మెంట్) శాఖను కృష్ణ బైరెగౌడకు కేటాయించడంపై మంత్రి రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజీనామా అనంతరం రామలింగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను పదవులు ఆశించలేదు. సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ కేబినెట్‌లో పదవులు కోరలేదు. నాకు బెంగళూరు డెవలప్‌మెంట్‌ శాఖ ఇస్తామని డీకేనే హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పినందుకే నా పదవికి రాజీనామా చేస్తున్నాను’ అని వివరణ ఇచ్చారు. తాజాగా డీకే సీనియర్ నేతను బుజ్జగించే యత్నం చేస్తున్నట్లు సమాచారం.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)