Breaking News

Karnataka: ముగిసిన సిద్ధరామయ్య-శివకుమార్ భేటీ.. రాజీ ఫార్ములా?

Published on Sat, 11/29/2025 - 11:20

బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అధికార మార్పిడికి సంబంధించిన చర్చలు ముమ్మరమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ శనివారం ఉదయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో  అల్పాహారం విందు చేశారు. 2026, మార్చి, ఏప్రిల్ నాటికి సిద్ధరామయ్య నుండి శివకుమార్‌కు ముఖ్యమంత్రి పీఠం బదిలీ అయ్యేలా ఫార్ములా రూపొందించినట్లు సమాచారం. త్వరలో ఈ వివరాలను ఇద్దరు నేతలు వెలువరించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతవరకు శివకుమార్ డిప్యూటీగా కొనసాగనున్నారు. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం కర్ణాటకలో బహిరంగ విభేదాలను కోరుకోవడం లేదు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లాంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిని హఠాత్తుగా తొలగించడం పార్టీకి నష్టం కలిగిస్తుందనే ఉద్దేశంతో సమాలోచనలు జరుపుతోంది.



సమావేశం తర్వాత ఇద్దరు నేతలు సోషల్ మీడియాలో చేసిన పోస్టులు అంతా సవ్యంగానే ఉందనే సందేశాన్ని పంపాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ‘ఎక్స్‌’లో, "నేను డి.కె. శివకుమార్‌తో అల్పాహారం తీసుకున్నాను" అని పోస్ట్ చేయగా, శివకుమార్ మరింత లోతైన అర్థాన్నిచ్చేలా, ‘ఈ ఉదయం కావేరి నివాసంలో అల్పాహార సమావేశం కోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిశాను. కర్ణాటక ప్రాధాన్యతలు, ముందుకు సాగే మార్గంపై  చర్చ జరిగింది’ అని రాశారు. ఈ అల్పాహార సమావేశంలో ఉప్మా, ఇడ్లీ, కేసరి బాత్ స్వీకరిస్తున్న ఇద్దరు నేతల ఫోటో.. వారి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని సూచిస్తోంది.
 

ఈ రాజీ ఫార్ములాకు శివకుమార్ అంగీకరించేందుకు అనేక బలమైన కారణాలు ఉన్నాయని వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా పునర్వ్యవస్థీకరణలో ఆయన విధేయులకు మరిన్ని క్యాబినెట్ పదవులు లభించనున్నాయి. ఆయన రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా కొనసాగుతారు. ముఖ్యమంత్రిపై చర్య తీసుకునేందుకు ఆయనకు తగినంత సంఖ్యాబలం లేదు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో శివకుమార్ పొందగలిగే ఉత్తమ ఒప్పందం ఇదేనని భావన ఉంది.  

కులం లెక్కల దృష్ట్యా, పార్టీ దృక్కోణం నుండి సిద్ధరామయ్యను తప్పించడం అంత సులభం కాదనే మాట వినిపిస్తోంది. ఆయన 'అహింద' (మైనారిటీలు, వెనుకబడిన తరగతులు,దళితులు) రాజకీయ కూటమికి అత్యంత శక్తివంతమైన నేతగా పేరొందారు. శివకుమార్ ఓబీసీ వొక్కలిగ సమాజానికి ప్రతినిధిగా ఉన్నారు. కాంగ్రెస్ ఈ నేతను కూడా దూరం చేసుకోలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ కేంద్ర నాయకులను కలవడానికి శివకుమార్ శనివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.
 

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)