Breaking News

దిగ్విజయ్‌ సింగ్‌ భావోద్వేగ లేఖలో ఏముంది?

Published on Sun, 05/05/2024 - 13:30

దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో మూడో దశలో పోలింగ్‌ మే 7న జరగనుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. రాష్ట్రంలోని రాజ్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్నారు.  తాజాగా ఆయన ఇవి తన జీవితంలో చివరి ఎన్నికలు అని వ్యాఖ్యానించారు.

దిగ్విజయ్‌ సింగ్‌ తాజాగా సోషల్ మీడియా ‘ఎక్స్‌’ హ్యాండిల్‌లో రాజ్‌గఢ్ ‍ప్రజలకు భావోద్వేగ లేఖ రాశారు. దానిలో ఆయన ‘నేను నా తండ్రి మరణించాక ఇంజినీరింగ్‌ పట్టా పుచ్చుకుని రాజ్‌గఢ్‌ వచ్చాను. నాడు ఇక్కడి ప్రముఖుడు కస్తూర్‌ చంద్‌ జీ కఠారీని కలుసుకున్నాను. అప్పుడు ఆయన నాతో ప్రతీ వ్యక్తి జీవితంలో 12 లక్ష్యాలను సాధించాలని పేర్కొన్నారు. 

కుటుంబాన్ని పోషించేంతటి సంపాదన ప్రతీ వ్యక్తికి అవసరమని, అలాగే పొదుపు చేయాలని, నగలు కొనుగోలు చేయాలని ఆయన తెలిపారు. సొంత ఇంటిని నిర్మించుకోవాలని, ఇవన్నీ సమకూరితే అదృష్టవంతుడివని,  అప్పుడు పేరు సంపాదించుకోవాలని వివరించారు. నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో  ఇలాగే ప్రయత్నించాను. అందులో నేను ఎంతవరకూ సక్సెస్ అయ్యానో నేనే అంచనా వేయలేను. సామాన్యులు మాత్రమే అలా చేయగలరు. ఇవి నా జీవితంలో చివరి ఎన్నికలు. వీటిలో నేను ఎంతవరకు విజయం సాధిస్తానో మీరే నిర్ణయిచాలి’ అని పేర్కొన్నారు.

మే 7వ తేదీన రాజ్‌గఢ్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దిగ్విజయ్ సింగ్ 10 ఏళ్ల పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1980- 90వ దశకంలో రాజ్‌గఢ్ నుండి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత తన సొంత ప్రాంతం నుంచి ఎన్నికల బరిలో దిగారు. ఈ ఎన్నికలు దిగ్విజయ్ సింగ్ ప్రతిష్టకే కాదు, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ భవిష్యత్తుకు కూడా కీలకం కానున్నాయి. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)