Breaking News

దురంధర్‌ రంభ హో ఫీవర్‌ 70 ఏళ్ల వయసులో స్టన్నింగ్‌ డ్యాన్స్‌ వైరల్‌ వీడియో

Published on Sun, 02/01/2026 - 15:37

ఆనందాన్ని వ్యక్తం చేయడానికి, జీవితంలో వర్తమాన క్షణాలను ఆస్వాదించడానికి వయసుతో పనేముంది. సమయం, సందర్భం కలిసి వస్తే మనసు నాట్యమయూరే అవుతుంది. ఇక నాట్యంలో ఆరితేరిన వారైతే.. ఇక చెప్పేదేముంది ఉరిమే ఉత్సాహంతో ఉర్రూతలూగాల్సిందే. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నా ఈ వీడియోను చూస్తే ఎంతటివరైనా కాలు కదపాల్సిందే.. పక్కా.! 

ఆ సోషల్‌ మీడియా సెన్సేషన్‌ మరెవ్వరో కాదు  బాలీవుడ్ వెండితెరపై ఒకప్పుడు తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటి కల్పనా అయ్యర్. వయసు 70 ఏళ్లు అయితేనేం  అందమైన డ్యాన్స్‌తో  మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. తన  కరియర్‌లో  ఐకానిక్‌ సాంగ్‌  ‘రంభా హో హో హో’ పాటకు అత్యంత అ‍ద్భుతంగా నృత్యం చేశారు. తాజాగా   ఈ పాటను దురంధర్‌లో వాడుకోవడంతో మరింత ఇంట్రస్టింగ్‌మారింది. దురంధర్ సినిమా  అటు కలెక్షన్లనుంచి  ఇటు వివాదాల కారనంగా అనేక కారణాలతో వార్తల్లో నిలిచింది. ఐకానిక్ రెట్రో పాట  'రంభ హో' వాడుకోవడం వాటిలో ఒకటి.

1981లో వచ్చిన 'అర్మాన్' చిత్రంలో ఈ పాటలో నటించిన సీనియర్ నటి కల్పనా అయ్యర్, దాదాపు 40 ఏళ్ల తరువాత ఆ మ్యాజిక్‌ను పునఃసృష్టించారు. దీంతొ అభిమానులు నాస్టాల్జియాతో పులకరించారు. స్వయంగా కల్పనా తన ఇన్‌స్టాఖాతాలో   శుక్రవారం ఈ వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఇలా అన్నారు. “ఒక స్నేహితురాలు నాకు ఈ క్లిప్‌ను పంపింది, ఇది నిన్న రాత్రిది, ఇలా చేశానని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.. చాలా కాలంగా డ్యాన్స్ చేయలేదు. ఇది చాలా ప్రత్యేకమైన సాయంత్రం. సిద్ధాంత్ పెళ్లి.” అని ఆమె పేర్కొన్నారు.  నలుపు-బంగారు బ్లౌజ్‌ ఊదా రంగు పట్టు చీరలో ఆమె స్టెప్పులుకు సోషల్‌ మీడియా ఫిదా అవుతోంది. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా కల్పనా అయ్యర్‌పై ప్రశంసల జల్లుకురుస్తోంది  

ఎవరీ కల్పనా అయ్యర్‌
బాలీవుడ్‌లో విలన్ పాత్రలకు, ముఖ్యంగా 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రంలో తన నటనకు బాగా గుర్తుండిపోయే కల్పనా అయ్యర్, మిస్ ఇండియా 1978 పోటీలో మొదటి రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత ఆమె మిస్ వరల్డ్ 1978లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, టాప్ 15 సెమీ-ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచారు. ఎక్కువగా బోల్డ్  అండ్‌  గ్లామరస్ పాత్రలను పోషించారు. 1980 నాటి 'ప్యారా దుష్మన్' చిత్రంలోని "హరి ఓం హరి", ఆ తర్వాత 1981లో 'అర్మాన్' చిత్రంలోని "రంభ హో" వంటి జనాదరణ పొందిన డ్యాన్స్ నంబర్లతో డ్యాన్సింగ్‌  క్వీన్‌గా పాపులర్‌ అయ్యారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)