Breaking News

Delhi: నిద్రిస్తున్న భర్తపై మరిగే నూనె, ఎర్ర కారం.. అరిస్తే ఇంకా పోస్తానంటూ..

Published on Wed, 10/08/2025 - 18:12

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని మదన్‌గీర్‌లో ఉంటున్న  దినేష్.. ఇంట్లో నిద్రస్తున్న సమయంలో అతని భార్య అతనిపై సలసల మరుగుతున్న నూనె, ఎర్రటి కారం పొడి పోసి, అతనికి నరకం అంటే ఏమిటో చూపించింది. అక్టోబర్ 3న ఫార్మాస్యూటికల్ కంపెనీ కార్మికుడు దినేష్‌(28) కాలిన గాయాలతో సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేరిన దరిమిలా ఈ దారుణం వెలుగు చూసింది.

అంబేద్కర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం దినేష్ నిద్రపోతున్నసమయంలో తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో అతని భార్య అతని శరీరంపై వేడి నూనె పోసింది. ఆ సమయంలో ఆ దంపతుల ఎనిమిదేళ్ల కుమార్తె ఇంట్లోనే ఉంది. అక్టోబర్ 2న.. తన పని ముగించుకున్నాక ఇంటికి తిరిగి వచ్చి, రాత్రి భోజనం చేసి, పడుకున్నానని దినేష్ పోలీసులకు తెలిపాడు. ‘నా భార్య, కుమార్తె  అదే గదిలో నిద్రపోతున్నారు. తెల్లవారుజామున 3.15 గంటల ప్రాంతంలో, నాకు అకస్మాత్తుగా శరీరం అంతటా  మంటపుట్టింది. నా భార్య నా శరీరం, ముఖంపై మరిగే నూనె పోయడం నేను చూశాను. నేను సహాయం కోసం అరుస్తున్నంతలో ఆమె నా కాలిన గాయాలపై ఎర్రని కారం పొడి చల్లింది" అని అతను తన ఫిర్యాదులో ఆరోపించాడు.

బాధితుడు అరుస్తుండగా అతని భార్య ‘అరచి గోల చేస్తే..  మీ మీద మరింత నూనె పోస్తానని బెదిరించింది. అయితే దినేష్ బాధను తట్టుకోలేక  గట్టిగా కేకలు పెట్టాడు. దానిని విన్న కింద అంతస్తులో  ఉంటున్న అతని ఇంటి యజమాని కుటుంబ సభ్యులు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారిలో ఒకరైన  అంజలి మీడియాతో మాట్లాడుతూ ‘ఏం జరుగుతున్నదో చూసేందుకు  మా నాన్న ముందుగా పైకి వెళ్ళారు. దినేష్‌ భార్య లోపలి నుంచి తలుపు తాళం వేసింది. తలుపు తెరవమని మేము వారిని అడిగాం. కొద్దిసేపటి తరువాత ఆమె  తలుపులు తెరిచింది. దినేష్‌ బాధతో విలవిలలాడటాన్ని చూశాం’ అని తెలిపింది.

ఈ ఘటన దరిమిలా ఇంటి యజమాని కలగజేసుకుని, బాధితుడిని ఆటోలో ఒంటరిగా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని మెరుగైన చికిత్స కోసం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి పంపించారు. దినేష్‌ దంపతులకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం దినేష్‌ భార్య అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ వివాదంలో పోలీసులు  ఇరువురి మధ్య రాజీ కుదిర్చారు. తాజాగా ఘటనలో దినేష్ భార్యపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు. 

#

Tags : 1

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు