Breaking News

ఢిల్లీ: భారీ వర్షంతో మొదలైన వీకెండ్‌..

Published on Sat, 08/10/2024 - 07:54

దేశరాజధాని ఢిల్లీలో భారీవర్షాలతో వారాంతం మొదలయ్యింది. గురువారం ఆకాశం మేఘావృతమైనప్పటికీ అక్కడక్కడ చిరుజల్లులు మాత్రమే కురిశాయి. అయితే శుక్రవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని జనానికి ఊరటనిచ్చింది.  

వర్షం కారణంగా పలు చోట్ల రోడ్లపై ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. దీంతో జనం అవస్థలు పడ్డారు. రోడ్లపై నీరు నిలవడంతో  వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు  ఎదురయ్యాయి. ముఖ్యంగా రాజోరీ గార్డెన్, ఠాగూర్ గార్డెన్, తిలక్ నగర్, సుభాష్ నగర్, వికాస్‌పురి, ఠాగూర్ గార్డెన్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసి రోడ్డపై నీరు నిలిచింది. వాక్‌వే స్టాండ్‌ లెవల్‌ వరకు నీరు నిండిపోవడంతో వాహనాలు నిదానంగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఆగస్టు 15 వరకు ఢిల్లీలో తేలికపాటి నుండి  ఓ మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఢిల్లీలో మరికొన్ని రోజుల పాటు చినుకులు పడే అవకాశం ఉంది. 10, 11 తేదీలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.  నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్‌లలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఔటర్ ఢిల్లీలోని ప్రేమ్ నగర్‌లో శుక్రవారం సాయంత్రం చెరువులో మునిగి ఇద్దరు చిన్నారులు  మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రేమ్ నగర్ పరిధిలోని రాణి ఖేడా గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు చెరువు వద్దకు వెళ్లారు. వారిలో ఇద్దరు చిన్నారులు నీటి లోతుల్లోకి వెళ్లిన కారణంగా మృతి చెందారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)