‘చాలా చెప్పాలి..కానీ లాభం లేదు’ అంటూ ఆత్మహత్య, ఫేస్‌బుక్‌ వీడియో

Published on Sat, 06/20/2026 - 15:58

 సాక్షి, న్యూఢిల్లీ:  ఢిల్లీలోని అశోక్ విహార్‌లో ఒక 19 ఏళ్ల యువకుడు నివాస భవనం పైనుంచి కిందపడి మరణించిన ఘటన  విషాదాన్ని నింపింది.  కిందపడిన వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.    దర్యాప్తు కొనసాగుతోంది.

అశోక్ విహార్ ఫేజ్-2లోని స్వాభిమాన్ అపార్ట్‌మెంట్స్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం
బాధితుడిన అనురాగ్‌గా గుర్తించారు. ఆజాద్‌పూర్‌లోని లాలా బాగ్ నివాసి అయిన అనురాగ్ తండ్రి రాజా రామ్, ఢిల్లీ హోమ్ గార్డ్‌లో పనిచేస్తున్నారు. ఏమైందో తెలియద గానీ శుక్రవారం సాయంత్రం 4:45 గంటల సమయంలో ఒక యువకుడు  భవనంపైనుచి దూకేశాడనే   సమాచారం అశోక్ విహార్ పోలీస్ స్టేషన్‌కు తెలిసింది.  వెంటనే బాధితుడిని దీప్ చంద్ బంధు ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. అప్పటికే   మరణించినట్లు వైద్యులు  ప్రకటించారు.పోలీసు బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. కేసు తీవ్రత దృష్ట్యా, ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సాక్ష్యాలను సేకరించడానికి క్రైమ్ టీమ్‌ను కూడా పిలిపించారు.పోస్ట్‌మార్టం , తదుపరి చట్టపరమైన ప్రక్రియల కోసం మృతదేహాన్ని బాబూ జగ్జీవన్ రామ్ మెమోరియల్ (BJRM) ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.

ఫేస్‌బుక్ వీడియో
దర్యాప్తులో భాగంగా ఘటనకు కొద్దిసేపటి ముందు అనురాగ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఒక వీడియోను అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. "ఇది నా మొదటి వీడియో చివరిdr కూడా.  నేను ఎవరినైనా బాధపెట్టి ఉంటే వాందరికీ సారీ. అలాగే నా వల్ల తమ జీవితాలు సరిగ్గా సాగడం లేదని భావించే వారికి క్షమాపణలు. చాలామందితో చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ దానివల్ల మారేదేమీ లేదు" అని వీడియోలో పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్‌గా కాంటాక్ట్ లెన్స్‌ : అమెరికన్‌ మహిళ సంబరం

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇది ఆత్మహత్య కేసు కావచ్చునని తెలుస్తోంది. అయితే, ఏదైనా కుట్ర లేదా ఇతర కారణాల కోణంతో సహా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  అతని ఆత్మహత్యకు పురికొల్పిన పరిస్థితులు ఇంకా తెలియరాలేదని, పోస్ట్‌మార్టం నివేదిక, తదుపరి దర్యాప్తు తర్వాత మరణానికి గల కారణంపై స్పష్టత వస్తుందని పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ముస్లిం, హిందూ జంట ప్రేమ పెళ్లి, ఆ తర్వాతి కథ తెలిస్తే!

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)