Breaking News

ఢిల్లీ సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు

Published on Sun, 02/25/2024 - 09:13

రైతుల ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను దృష్టిలో ఉంచుకుని దాదాపు రెండు వారాల పాటు ఢిల్లీ-హరియాణా సరిహద్దుల్లోని సింఘు, తిక్రీ సరిహద్దు క్రాసింగ్‌లను మూసివేశారు. అయితే ఇప్పుడు పరిస్థితులు కుదుటపడటంతో అధికారులు వాటిని పాక్షికంగా తెరిచే ప్రక్రియను ప్రారంభించారు. 

వాహనాల రాకపోకలకు వీలుగా సింఘు సరిహద్దు రహదారి ‘సర్వీస్ లేన్’, తిక్రీ సరిహద్దు రహదారికి చెందిన ఒక లేన్ తెరుస్తున్నామని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ నిర్ణయంతో ఢిల్లీ నుండి హరియాణాకు వెళ్లే ప్రయాణికులకు గొప్ప ఉపశమనం లభించింది. పంటలకు కనీస మద్దతు ధర హామీతో పాటు వ్యవసాయ రుణాల మాఫీ తదితర డిమాండ్లను ‍ప్రభుత్వం నెరవేర్చాలంటూ  రైతులు ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను ప్రారంభించారు. దీంతో ఈ రెండు సరిహద్దు మార్గాలను ఫిబ్రవరి 13న మూసివేశారు. 

ఈ నెలాఖరు వరకు తమ పాదయాత్రను నిలిపివేస్తామని నిరసన తెలుపుతున్న రైతులు ప్రకటించడంతో ప్రభుత్వం  ఈ నిర్ణయం తీసుకున్నదని ఆ పోలీసు అధికారి తెలిపారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటామని, అవసరమైతే సరిహద్దులను మళ్లీ మూసివేస్తామని ఆయన అన్నారు. కాగా కుండ్లీ సరిహద్దు రహదారిలో సర్వీస్ లేన్ తెరిచారు. దీంతో ఢిల్లీ వెళ్లే వాహనదారులకు ఉపశమనం లభించింది. 

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)