Breaking News

‘ఢిల్లీ కాదది.. ఇంద్రప్రస్థ’.. సాక్ష్యాలతో ఎంపీ లేఖ

Published on Sat, 11/01/2025 - 11:19

న్యూఢిల్లీ: ఢిల్లీ పేరు మార్పు అంశం మరోమారు వార్తల్లో నిలిచింది. ఢిల్లీ బీజేపీ ఎంపి ప్రవీణ్ ఖండేల్వాల్ తాజాగా హోంమంత్రి అమిత్ షాకు దేశరాజధాని ఢిల్లీ పేరును మార్చాలంటూ లేఖ రాశారు. రాజధాని పురాతన మూలాలను అనుసరించి, ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలని ఆయన కోరారు. ఇదేవిధంగా పాత ఢిల్లీ రైల్వే స్టేషన్‌ను ‘ఇంద్రప్రస్థ జంక్షన్’గా, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ‘ఇంద్రప్రస్థ విమానాశ్రయం’గా మార్చాలని ప్రవీణ్ ఖండేల్వాల్ కోరారు.

హోంమంత్రి అమిత్ షాతో పాటు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, ఇతర మంత్రులకు కూడా  ఈ లేఖ కాపీలను ఖండేల్వాల్ పంపారు. ఈ విధంగా పేరు మార్చడం అనేది చారిత్రక, సాంస్కృతిక, నాగరికత మూలాలను ప్రతిబింబిస్తుందని  ఆ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ చరిత్ర వేల సంవత్సరాల నాటిది మాత్రమే కాదు.. ఇది భారతీయ నాగరికత ఆత్మ, పాండవులు స్థాపించిన ఇంద్రప్రస్థ నగర సంప్రదాయానికి ‍ప్రతిబింబం.. అని ఆయన ఆ లేఖలో  రాశారు. పాండవుల విగ్రహాలను దేశ రాజధానిలో ఏర్పాటు చేయాలని కూడా కోరారు. అలా చేసినప్పుడే భారతదేశ చరిత్ర, సంస్కృతికి  పునరుజ్జీవం వస్తుందన్నారు. ఢిల్లీ నగరం పాండవులు అనుసరించిన నీతి, ధర్మం, ధైర్యానికి చిహ్నంగా నిలిచిందన్నారు.

దేశంలోని ప్రయాగ్‌రాజ్, అయోధ్య, ఉజ్జయిని, వారణాసి తదితర నగరాలు వాటి పురాతన గుర్తింపులతో తిరిగి వెలుగొందుతుండగా, ఢిల్లీ విషయంలో కూడా అదే విధానాన్ని అనుసరిస్తూ ‘ఇంద్రప్రస్థ’గా మార్చాలని కోరారు. తద్వారా దేశరాజధాని.. జాతీయవాదానికి చిహ్నం అనే సందేశం అందరికీ అందుతుందని ఆ లేఖలో ఆయన రాశారు. గతంలో విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఇదే డిమాండ్ చేసింది. ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చినప్పుడే దేశరాజధానికి నిజమైన సాంస్కృతిక గుర్తింపు లభిస్తుందని వీహెచ్‌పీ పేర్కొంది.

ఇది  కూడా చదవండి: Sabarimala Theft Case.. మాజీ అధికారి అరెస్ట్‌

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)