Breaking News

కవిత అరెస్ట్‌ చట్టబద్దమే.. కోర్టు ఉత్తర్వుల్లో సంచలన విషయాలు

Published on Sun, 03/17/2024 - 12:04

సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు సెషన్స్‌ కోర్టు ఏడు రోజులు కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో కస్టడీకి సంబంధించి కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో సంచలన విషయాలను వెల్లడించింది. కవిత అరెస్ట్‌ చట్టబద్దమే అని కోర్టు పేర్కొంది. 

కాగా, ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించిన కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, ఢిల్లీలోరి రౌస్‌ అవెన్యూ కోర్టులో కవితను ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. విచారణ అనంతరం, ఈడీ కోరిక మేరకు కవితను ఏడు రోజుల పాటు కస్టడీ విధించింది కోర్టు. ఈ సందర్బంగా కస్టడీకి ఇచ్చిన ఉత్తర్వుల్లో కోర్టు సంచలన విషయాలను వెల్లడించింది.

కోర్టు ఉత్తర్వుల ప్రకారం..‘కవిత అరెస్టు చట్టబద్ధమే. కవితను అరెస్టు చేయవద్దని ఎక్కడా సుప్రీంకోర్టు లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వలేదు. తదుపరి విచారణ వరకు మాత్రమే సమన్లు ఇవ్వమని ఈడీ సుప్రీంకోర్టుకు చెప్పింది. ఆ తర్వాత రెండుసార్లు ఈడీ సమన్లు ఇచ్చినప్పటికీ కవిత సుప్రీంకోర్టులో వాటిని ఛాలెంజ్ చేయలేదు. సుప్రీంకోర్టుకి ఇచ్చిన మాట తప్పారా? లేదా అన్నది మా పరిధిలో నిర్ణయించే అంశం కాదు. సెక్షన్-19 ప్రకారం అన్ని నిబంధనలు పాటిస్తూ అరెస్టు చేశారా? లేదా అన్నది మాత్రమే చూస్తాం.   

కవితను చట్టబద్ధంగానే అరెస్టు చేశారు. మనీలాండరింగ్ చట్టం సెక్షన్-19 కింద అన్ని నిబంధనలను పాటించారు. ఈ నేరాల్లో కవిత కీలక పాత్ర పోషించారనేదానికి ఆధారాలు ఉన్నాయి. అందుకే ఆమెను రిమాండ్ చేస్తూ దర్యాప్తు కోసం ఏడు రోజుల ఈడీ కస్టడీకి అప్పగిస్తున్నాం. సీసీటీవీ కవరేజ్‌లో ఆమెను ఇంటరాగేషన్ చేయాలి. సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచాలి. మహిళను విచారించే సమయంలో తీసుకోవలసిన అన్ని నిబంధనలు పాటించాలి. 

ఆమె తరపు న్యాయవాదులు ప్రతీరోజు అరగంట పాటు కలవవచ్చు. ఆమె భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ , బావ హరీష్ రావు, కజిన్ శ్రీధర్, ప్రణీత్ కుమార్, శరత్ కలుసుకునే అవకాశం ఉంది. అరెస్టు తరువాత హైబీపీకి గురైనట్లు ఈసీజీ రిపోర్టు ఉన్న నేపథ్యంలో తగిన మందులు ఇవ్వాలి.  24 గంటలకు ఒకసారి కవితకు వైద్య పరీక్షలు చేయాలి’ అని కోర్టు పేర్కొంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)