Breaking News

ఖిలాఫత్‌ ఉగ్ర మాడ్యూల్‌ బట్టబయలు

Published on Fri, 09/12/2025 - 05:45

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌తో లింకులున్న ఉగ్ర మాడ్యూల్‌ ఒక దానిని ఢిల్లీ పోలీసులు బట్టబ యలు చేశారు. వేర్వేరు రాష్ట్రాల్లో దాడులు జరిపి ఇందుకు సంబంధించి ఐదుగురిని అరె స్ట్‌ చేశారు. పాకిస్తాన్‌ హ్యాండ్లర్‌ ద్వారా వీరు ఆన్‌లైన్‌లో యువతను ఉగ్ర ఊబిలోకి లాగు తున్నారు. కొంత భూభాగాన్ని స్వాధీనం చేసు కుని ఖిలాఫత్‌ జోన్‌గా ప్రకటించడం ద్వారా భారత్‌లో జిహాద్‌ను ప్రారంభించాలన్నది వీరి ప్రణాళిక అని అదనపు పోలీస్‌ కమిషనర్‌ (స్పె షల్‌ సెల్‌) ప్రమోద్‌ కుష్వాహా మీడియాకు తెలి పారు. 

ఘజ్వా–ఇ–హింద్‌ (భారత్‌పై దాడి) నినాదంతో దేశవ్యాప్తంగా హింసాత్మక కార్యక లాపాలకు పాల్పడేందుకు వీరు ప్రయత్నిస్తు న్నారన్నారు. పట్టుబడిన వారిలో రాంచీకి చెందిన అషర్‌ దానిష్‌ అలియాస్‌ అష్రార్‌ ఖురే షి(23), ముంబైకి చెందిన అఫ్తాబ్‌ ఖురేషి, సుఫియాన్‌ అబూబకర్‌లు, తెలంగాణకు చెందిన మహ్మద్‌ హుజైఫా, మధ్యప్రదేశ్‌కు చెందిన కమ్రాన్‌ ఖురేషి ఉన్నారు. వీరితోపాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుని, విచారిస్తు న్నట్లు వివరించారు. 

ఈ మాడ్యూల్‌కు డానిష్‌ సారథ్యం వహిస్తూ పాకిస్తాన్‌లోని హ్యాండ్లర్‌ తరఫున కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఈ హ్యాండ్లకు సీఈవో, గజ్బా, ప్రొఫెసర్‌ అనే సంకేత నామం ఉందని ఏసీపీ కుష్వాహా చెప్పారు. సోషల్‌ మీడియా చాట్ల ద్వారా పాక్‌ హ్యాండ్లర్‌ వీరికి మందు పాతరల డిజైన్లు, తయారీలో సలహాలిస్తున్నాడు. గత ఆరు నెలలుగా వీరి కార్యకలాపాలపై కన్నేసి ఉంచామని, ఢిల్లీలోని హజ్రత్‌ నిజాముద్దీన్‌ రైల్వే స్టేషన్‌లో అఫ్తాబ్, సుఫియాన్‌లను మొదటగా అరెస్ట్‌ చేశామన్నారు. 

మేవాడ్‌కు చెందిన వ్యక్తి నుంచి ఆయుధాలను కొనుగోలు చేసేందుకు వచ్చి వీరు పట్టుబడ్డారని తెలిపారు. వీరి మరికొంత మందిని కూడా చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. ఐఈడీలను తయారు చేసేందుకు అవసరమైన వివిధ రకాల సామగ్రి, రసాయనాలను స్వాధీనం చేసుకుని, విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపించినట్లు చెప్పారు. ఖిలాఫత్‌ గతంలో పట్టుబడిన ఉగ్ర మాడ్యూల్‌లతో సంబంధం లేకుండా కొత్తగా ఏర్పాటైన గ్రూపుగా పేర్కొన్నారు. ఖిలాఫత్‌ జోన్‌కు అవసరమైన భూమి కొనుగోలు కోసం వీరు నిధుల సేకరణలో బిజీగా ఉన్నారన్నారు. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)