Breaking News

కాక్రోచ్‌ పార్టీ ర్యాలీ: ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం

Published on Sun, 07/19/2026 - 20:56

ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమవుతుండడంతో పాటు అదే రోజున కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) "చలో సంసద్" ర్యాలీ దృష్ట్యా న్యూఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఈ ర్యాలీకి పిలుపునిచ్చింది. 

ఆదివారం ఎక్స్‌లో విడుదల చేసిన ప్రకటనలో న్యూఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ సచిన్ శర్మ.. ఇలాంటి నిరసన ర్యాలీకి అనుమతి కోరలేదు, ఇవ్వలేదని చెప్పారు. న్యూఢిల్లీ జిల్లా అంతటా బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 (గతంలో సీఆర్‌పీసీ సెక్షన్ 144) కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని డీసీపీ తెలిపారు. 

ఈ ఆంక్షల ప్రకారం జంతర్ మంతర్‌లో నిర్దేశించిన నిరసన స్థలం మినహా అదీ ముందస్తు అనుమతితో తప్ప, 5 లేదా అంతకంటే ఎక్కువ మంది పాల్గొనే నిరసన ర్యాలీలు, ఊరేగింపులు, ఆందోళనలు, సమావేశాలు నిషేధించారు. ప్రజలెవరు ర్యాలీలలో పాల్గొనొద్దని విజ్ఞప్తి చేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల సహకరించాలని పోలీసులు కోరారు.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)