Breaking News

సోనియా, రాహుల్‌పై కేసు

Published on Mon, 12/01/2025 - 04:41

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీని చిరకాలంగా వెంటాడుతున్న నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేతలు సోనియాగాం«దీ, రాహుల్‌పై ఢిల్లీ పోలీసులు ఆదివారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈడీ ఫిర్యాదు ఆధారంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. వారితో పాటు ఈ కేసులో సహ నిందితులైన కాంగ్రెస్‌ నేతలు సుమన్‌ దుబే, శామ్‌ పిట్రోడాతో పాటు యంగ్‌ ఇండియన్, అసోసియేటెడ్‌ జర్నల్స్, దాని ప్రమోటర్‌ సునీల్‌ భండారీ తదితరులపై ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి. 

వారిపై ఐపీసీ 120 బి (నేరపూరిత కుట్ర), 406 (నమ్మకద్రోహం), 403 (ఆస్తులు కాజేయడం), 420 (మోసం) సెక్షన్లు మోపారు. మనీ లాండరింగ్‌ నిరోధకచట్టంలోని 66(2) సెక్షన్‌ ప్రకారం దఖలు పడ్డ అధికారాలను ఉపయోగించుకుని ఎఫ్‌ఐఆర్‌ దాఖలు దిశగా ఈడీ చర్యలు తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎఫ్‌ఐఆర్‌ నమోదుపై కాంగ్రెస్, బీజేపీ పరస్పర దూషణలకు దిగాయి. బోగస్‌ కేసును అడ్డుపెట్టుకుని సోనియా, రాహుల్‌ను వేధించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చౌకబారు రాజకీయాలకు చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ నేతలు జైరాం రమేశ్, అభిషేక్‌ సింఘ్వీ, ప్రమోద్‌ తివారీ తదితరులు మండిపడ్డారు. వారు ఎంతటి అభద్రతా భావంలో ఉన్నదీ దీన్నిబట్టి మరోసారి రుజువవుతోందన్నారు. వారి ఆరోపణలను బీజేపీ సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ తోసిపుచ్చారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)